విడుదలకు పరిచయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసిన్ మూవీ క్రియేషన్స్ పతాకంపై ‘హైదరాబాద్ నవాబ్స్’ ఫేమ్ లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పరిచయం’. విరాట్ కొండూరు హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో సామ్రాట్ కౌర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఒక మంచి ఫీల్, ఎమోషనల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని చిత్ర దర్శకుడు లక్ష్మీకాంత్ చెన్నా తెలిపారు. చిత్ర నిర్మాత రియాజ్ మాట్లాడుతూ- మేం అనుకున్నదానికంటే సినిమా బాగా వచ్చిందని, ఫస్ట్ కాపీ చూసి సినిమామీద కాన్ఫిడెన్స్ రెట్టింపు అయిందని, తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని, త్వరలో సెన్సార్ పూర్తిచేసుకొని జూన్ మొదటివారంలో రిలీజ్ చేస్తామని తెలిపారు.