సంజయ్‌దత్ ప్రస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ప్రస్థానం హిందీ రీమేక్‌లో నటించనున్నారు. ఒరిజినల్‌ను తెరకెక్కించిన దేవా కట్టానే హిందీలోనూ దర్శకుడు. అక్కడ సాయికుమార్ పాత్రను ఖల్‌నాయక్ సంజయ్‌దత్, శర్వానంద్ పాత్రలో అలీ ఫాజల్ నటించనున్నారు. 2010లో విడుదలైన ప్రస్థానంకు ఎన్నో అవార్డులు వచ్చాయి. శర్వానంద్, సాయికుమార్‌కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. రాజకీయ నేపథ్యంలో సాగే ప్రస్థానం గోవాలో జరిగిన ఇండియన్ పనోరమా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు కూడా ఎంపికైంది. ఈ కథ నచ్చిన సంజయ్‌దత్ ప్రొడక్షన్ హౌజ్ సంస్థలో ఆయనే సినిమాను నిర్మిస్తున్నారు. అమైరా దస్తూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. జూన్ 1న సంజయ్ దత్ తల్లి నర్గిస్ జన్మదినం సందర్భంగా షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. సంజయ్‌దత్, అలీ ఫాజల్, అమైరా దస్తూర్ తదితరలు నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు: దేవాకట్టా, నిర్మాత: సంజయ్‌దత్.