టీజర్‌లో వైఫ్ ఆఫ్ రామ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచు లక్ష్మి ముఖ్యపాత్రలో ప్యూర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ‘వైఫ్ ఆఫ్ రామ్’ టీజర్ విడుదలై ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించింది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఆమె పేరు దీక్ష. ఆమెకు ఒక సమస్య ఉందా లేక ఆమే ఒక సమస్యా! అనే పాయింట్‌తో ఆద్యంతం థ్రిల్లింగ్‌గా సాగుతుంది ఈ సినిమా. జూన్ 1న ఈ చిత్రం ట్రైలర్ విడుదల కాబోతోంది. సమాజాన్ని ప్రభావితం చేసిన మహిళల సమక్షంలో ఈ ట్రైలర్‌ను లాంఛ్ చేయబోతున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్. ఆమె జీవితంలో గుండెలు పగిలే సంఘటనలుంటాయి. ప్రతిదానికీ భయపడుతుంది. భయం అంటే తెలియని దానిలా ప్రవర్తిస్తుంది. ఒక న్యాయం కోసం తను చేసే పోరాటంలో ఆమె ఒకలా ఉండదు. ఇలాంటి పాత్ర తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతులను అందిస్తాయి అంటుంది చిత్ర బృందం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరిదశలో ఉన్న ఈ సినిమా జూన్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. కృతిప్రసాద్, విద్యా నిర్వాణ మంచు, ఆనంద్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సామ్రాట్‌రెడ్డి, ఆదర్శ్ బాలకృష్ణ, ప్రియదర్శి, శ్రీకాంత్ అయ్యర్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.