అనువంశికత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంతోష్‌రాజ్, నెహాదేశ్ పాండే జంటగా సీనియర్ నటుడు సుమన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా అనువంశికత. కౌండిన్య మూవీస్ బ్యానర్‌పై తాళ్లపల్ల దామోదర్ గౌడ్ నిర్మించగా ఈ చిత్రానికి దర్శకుడు రమేష్ ముక్కెర. ఈ చిత్ర ప్రిమియర్ షో ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి చిత్రాన్ని చూసి మేనరికం చేసుకోవటంవల్ల అనర్థాలు ఏమిటి సమస్యలపై రూపొందించిన ఈ అనువంశికత చాలా బాగుంది. పాటలు చాలా బాగున్నాయి. ఇటువంటి చిత్రాన్ని తీసిన నిర్మాత దామోదర్‌గౌడ్, దర్శకుడు రమేష్ ముక్కెర ఇతర సాంకేతిక వర్గానికి అభినందనలు. టిఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు మాట్లాడుతూ సాంగ్స్ చాలా బాగున్నాయి. రక్తసంబంధితమైన విషయాలపై తీసిన ఈ చిత్రం తప్పక ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ ఈ సినిమా చూసిన ప్రతిఒక్కరూ మెచ్చుకుంటారు. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత దామోదర్‌గౌడ్, చిత్ర యూనిట్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: అడుసుమిల్లి విజయకుమార్, పాటలు: చంద్రబోస్, తైదల బాపు, కందకోట్ల రామకృష్ణ, నిర్మాత: తాళ్లపల్ల దామోదర్‌గౌడ్, కథ, మాటలు, సంగీతం, దర్శకత్వం: రమేష్ ముక్కర.