ఆపరేషన్ 2019 ట్రైలర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శతాధిక చిత్రాల కథానాయకుడు శ్రీకాంత్ హీరోగా మహాత్మా, ఆపరేషన్ దుర్యోధన వంటి పవర్‌ఫుల్ చిత్రాల తర్వాత మరోసారి పవర్‌ఫుల్ పాత్రలో నటించిన చిత్రం ‘ఆపరేషన్ 2019’. బివేర్ ఆఫ్ పబ్లిక్ అనేది ట్యాగ్‌లైన్. అలివేలమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణం బాబ్జీ దర్శకత్వంలో అలివేలమ్మ నిర్మించిన ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ ట్రైలర్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ట్రైలర్ బాగుంది. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు. శ్రీకాంత్ అంటే పరిశ్రమలో అందరికీ ఇష్టం. మంచి నటుడే కాదు, మంచి వ్యక్తి కూడా. తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధించాలి అన్నారు. నటుడు శివకృష్ణ మాట్లాడుతూ.. ప్రతి సినిమా విజయవంతంగా ఆడాలని కోరుకుంటున్నాను. అలా అయినప్పుడే ఇండస్ట్రీ చక్కగా ఉంటుంది అన్నారు. హీరోయిన్ యజ్ఞశెట్టి మాట్లాడుతూ.. తెలుగులో ఇది నా మొదటి చిత్రం. ఈ సినిమా విషయంలో శ్రీకాంత్ సహకారం మరిచిపోలేనిది అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ.. సినిమా ఆడాలంటే స్టార్లు అవసరం లేదని మహానటి ప్రూవ్ చేసింది. సినిమాకి మంచి నటీనటులు కుదిరినప్పుడే ఆ సినిమా సక్సెస్ అవుతుంది. శ్రీకాంత్ దమ్మున్న హీరో. ఏ హీరో కూడా పోస్టర్‌పై న్యూడ్ పోస్టర్ వేస్తానంటే ఒప్పుకోడు. కానీ సినిమా పట్ల కమిట్‌మెంట్ ఉన్న హీరో కాబట్టి ఈ సాహసం చేశాడు. పకడ్బందీ స్ట్రీన్‌ప్లేతో చేసిన చిత్రం. జూన్ నెలాఖరులో విడుదల చేస్తాం అన్నారు. శ్రీకాంత్ మాట్లాడుతూ... దర్శకుడు కరణం బాబ్జీతో మెంటల్ పోలీస్ తరువాత చేసిన చిత్రమిది. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుంది అన్నారు.