మహానటి విజయోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానటి సావిత్రి జీవిత నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘మహానటి’. కేవలం తెలుగు ప్రేక్షకులనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికుల మనసులు గెలుచుకుంది ఈ చిత్రం. ‘మహానటి’ విడుదలై మూడో వారంలోకి అడుగుపెట్టినా ఇంకా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియాతో సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా స్వప్నదత్ మాట్లాడుతూ- ‘‘మూడోవారం కూడా ‘మహానటి’ సినిమా విజయవంతంగా రన్ అవుతోంది. ప్రేక్షకులు చూపించిన ప్రేమకు ఇంకా మంచి సినిమాలు చెయ్యాలనే ఆలోచన వస్తోంది. రాజేంద్రప్రసాద్, నాగచైతన్య ఇలా ప్రతి ఒక్కరు మా సినిమా చేసినందుకు ధన్యవాదాలు. సహకరించిన మీడియాకు కృతజ్ఞతలు’’అన్నారు. ప్రియాంక దత్ మాట్లాడుతూ- ‘‘మంచి సినిమాలు చెయ్యడానికి ప్రయత్నం చేస్తాం. మహానటి సినిమా మాపై బాధ్యతను మరింత పెంచింది. సినిమాను విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు’’అన్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ- ‘‘నేను ఏదైతే అనుకున్నానో ప్రేక్షకులు అదే ఫీల్ అవుతున్నారు. డైరెక్టర్‌గా నాకు హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో భాగం అయినందుకు గర్వంగా ఉంది. సినిమాను వెనక వుండి నడిపించిన అందరికీ థాంక్స్ చెబుతున్నాను. సినిమా మొదలైన దగ్గరి నుండి అందరు బాగా సపోర్ట్ చెయ్యడం జరిగింది’’ అని అన్నారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ- ‘‘సావిత్రిగారి లైఫ్ చూసి నేను షాక్ అయ్యాను. వైజయంతి మూవీస్ ఈ సినిమాను నిర్మించడం గొప్ప విషయం. నాగ్ అశ్విన్ సినిమాను నడిపించిన విధానం గ్రేట్. మహానటి లాంటి సినిమాలు అరుదుగా వస్తూఉంటాయి’’ అన్నారు. కీర్తిసురేష్ మాట్లాడుతూ- ‘‘నన్ను సపోర్ట్‌చేస్తున్న మీడియాకు ధన్యవాదాలు. డైరెక్టర్ నాగ్, స్వప్న, ప్రియాంక నాకు అందించిన సహకారం మరువలేనిది. సాంకేతిక నిపుణులందరికీ ధన్యవాదాలు. అమ్మ, నాన్నలకు థాంక్స్. వారి సహకారం మరువలేనిది. అందరు కష్టపడ్డారు. కాబట్టి సినిమా విజయం సాధించింది. ఈ సక్సెస్ నేను మర్చిపోలేను’’ అని అన్నారు.