సోషల్ మీడియా నేపథ్యంలో ఐతే 2.0

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రనీల్ గుప్తా, జారాషా, అభిషేక్, కర్తవ్య, మృణాల్, నీరజ్, మృదాంజలి ప్రధాన తారాగణంగా రాజ్‌మాదిరాజ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘ఐతే 2.0’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. సోషల్ మీడియా నేపథ్యంలో సాగే కథాకథనంతో ఈ సినిమా రూపొందించామని, నలుగురు నిరుద్యోగులు ఆధునిక టెక్నాలజీతో తమకు సంబంధం లేని నేరంలో ఇరుక్కుని, అదే టెక్నాలజీ ఉపయోగించి, ఆ సమస్యనుండి ఎలా బయటపడ్డారు అనేది ఈ సినిమాలో హైలెట్ అని తెలిపారు. సోషల్ మీడియావల్ల లాభాలే కాదు నష్టాలు కూడా ఉన్నాయని తెలిపే చిత్రమని, ఆకలి, ఆశ, ఆక్రోశం అనే అంశాలపై మూడు పాటలు హైలెట్‌గా ఉంటాయని ఆయన అన్నారు. త్వరలో పాటలు విడుదల చేసి, సినిమాను కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, ఐతేకు ధీటుగా ఈ చిత్రం ఉంటుందని, నిర్మాత విజయరామరాజు అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కౌశిక్ అభిమన్యు, మాటలు, పాటలు: కిట్టూ విస్సాప్రగడ, నిర్మాతలు: విజయరామరాజు, హేమంత్ వల్లపురెడ్డి, దర్శకత్వం: రాజ్‌మదిరాజ్.