ముహూర్తం కుదిరిందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి బాలకృష్ణ తదుపరి చిత్రానికి సన్నాహాలు జోరందుకున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ సినిమా చేస్తున్న ఆయన తన తదుపరి చిత్రానికి ఓకె చెప్పినట్టు తెలిసింది. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తారు. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు సంచలన విజయం సాధించి బాలకృష్ణ కెరియర్‌లో నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో బాలయ్య 100వ చిత్రాన్ని బోయపాటితో చేయాలనుకున్నాడు కానీ కుదరలేదు. అందుకే ఈసారి బోయపాటితో సినిమాకు ఓకె చెప్పాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కే చిత్రానికి సంబంధించిన ప్రకటనను జూన్ 10న వెలువడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆ రోజు బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను ప్రకటిస్తారంటూ వార్తలు వస్తున్నాయి. ఇదివరకే వీరిద్దరిమధ్య కథా చర్చలు జరిగాయని, మరో ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా బాలయ్యను సరికొత్తగా చూపేందుకు బోయపాటి స్క్రిప్ట్ సిద్ధం చేశాడట. ఈ సినిమాపై అటు నందమూరి అభిమానులు కూడా ఆసక్తితో వున్నారు.