యంగ్ స్టార్స్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిత్యఓం, స్వాతి టాండన్ జంటగా హరిచందన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న త్రిభాషా చిత్రం ‘యంగ్ స్టార్స్’. రాధ వైష్ణవ్ లక్ష్మీనారాయణ ప్రొడక్షన్స్ పతాకంపై రాధ వైష్ణవ్ లక్ష్మీనారాయణ, ఔరంగజేబ్, వినోద్‌పార్వతి, మురళీకృష్ణ, మోహన్‌దాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో యంగ్‌స్టార్స్ చిత్రీకరణ ప్రారంభమైంది. దర్శకుడు హరిచందన్ మాట్లాడుతూ.. నేటి సమాజంలో స్నేహం, ప్రేమ అనే రెండు రిలేషన్స్ యువతరం జీవితాలను ఏవిధంగా ప్రభావితం చేస్తున్నాయి. ఏ తరహా అలజడులను సృష్టిస్తున్నాయన్న కానె్సప్ట్‌తో యంగ్ స్టార్స్ చిత్రం తెరకెక్కనుంది. ఆదిత్యఓం పాత్ర విభిన్నంగా ఉంటుంది. సీనియర్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి వర్క్‌చేస్తున్నారు. హైదరాబాద్, వైజాగ్, అరకు, ముంబై పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ మూడు షెడ్యూల్స్‌లో చేసి, దసరాకు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు.