ఎర్రసూర్యుడు కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు మాదాల రంగారావు (70) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంత కాలంగా శ్వాసకోస సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారు జామున 5 గంటలకు తుదిశ్వాస విడిచారు. ప్రకాశం జిల్లా మైనంపాడు స్వగ్రామంలో 1948 మే 25న జన్మించిన మాదాల రంగారావు ప్రజా నాట్యమండలిలో క్రియాశీల సభ్యుడిగా పనిచేశారు. ఎర్రమల్లెలు, విప్లవశంఖం, స్వరాజ్యం, ఎర్ర సూర్యు డు, ఎర్ర పావురాలు, జనం మనం, ప్రజాశక్తి తదితర చిత్రాల్లో నటించిన రంగారావు రెడ్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. 80 దశకంలో ప్రేమకథా చిత్రాల హవా నడుస్తున్నా.. విప్లవాత్మక చిత్రాలను నిర్మించి మంచి విజయాలను అందుకున్నారు. నవతరం ప్రొడక్షన్స్ పేరిట నిర్మాణ సంస్థను స్థాపించారు. ప్రముఖ దర్శకుడు టి.కృష్ణ, నిర్మాత పోకూరి బాబూరావు ఈయన సహాధ్యాయులు. నవతరం ప్రొడక్షన్స్ పతాకంపై మాదాల రంగారావు 1980లో తీసిన ‘యువతరం కదిలింది’ చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి బంగారు నంది పురస్కారం లభించింది. వామపక్ష భావజాలం కలిగిన రంగారావు.. అవినీతి, అణచివేత లాంటి సామాజిక సమస్యలను ప్రతిబింబిస్తూ అనేక చిత్రాలు రూపొందించారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా మాదాల రంగారావు వెండితెరపై విభిన్న పాత్రలు పోషించారు. చైర్మన్ చెలమయ్యతో సినీరంగ ప్రవేశం చేసిన ఆయన మరో కురుక్షేత్రం, యువతరం కదిలింది, ఎర్రమల్లెలు, విప్లవశంఖం, నవోదయం, మహాప్రస్థానం, తొలిపొద్దు, ప్రజాశక్తి, బలిపీఠంపై భారతనారి, ఎర్రపావురాలు, స్వరాజ్యం, జనం మనం వంటి విప్లవ భావాలున్న సినిమాలతో ఆకట్టుకున్నారు. చిత్ర పరిశ్రమలో తనదైన శైలిలో సినిమాలు తీస్తూ ముందుకు సాగిపోయిన ఆయన మారుతున్న పరిస్థితుల్లో కూడా నమ్ముకొన్న సిద్ధాంతాలను చివరి వరకూ విడవలేదు. విప్లవ భావాలున్న చిత్రాల్లో నటించి, తెలుగు సినీ ప్రేక్షకులను మెప్పించిన ఆయన సమజంలో వేళ్లూనుకున్న అవినీతిని తన సినిమాల్లో చూపించారు. ఆయన తనయుడు మాదాల రవి ఆయన బాటలోనే నడుస్తూ హీరోగా కొనసాగుతున్నారు. మాదాల మృతిపై టాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఆయన భౌతికాయాన్ని కుమారుడు మాదాల రవి నివాసానికి తరలించి అభిమానుల సందర్శనార్థం ఉంచారు.
చంద్రబాబు సంతాపం: అభ్యుదయ సినీ నటుడు, ప్రజా నాట్యమండలి కళాకారుడు మాదారాల రంగారావు మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రగాఢ సంతాపం తెలిపారు. అవినీతి, అక్రమాలపై, సామాజిక దురన్యాయాలపై మాదాల సినీ మాధ్యమం ద్వారా పోరాడి ప్రజల హృదయాలను చూరగొన్నారన్నారు. మాదాల రంగారావు కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు సానుభూతి తెలిపారు.
పవన్ కళ్యాణ్: తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక స్థానం పొందిన నటులు, దర్శకులు, నిర్మాత మాదాల రంగారావు మృతి చెందారని తెలిసి చాలా బాధపడ్డాను. 80ల్లో మాదాల వామపక్ష, అభ్యుదయ భావాలతో తెరకెక్కించిన చిత్రాలు నాటి సమాజంలోని పరిస్థితులకి అద్దం పట్టాయి. యువతరం కదిలింది, ఎర్రమల్లెలు, స్వరాజ్యం, విప్లవ శంఖం లాంటి చిత్రాలతో తెలుగుతెరపై తనదైన ముద్రను వేశారు. ఆ చిత్రాల్లోని కథాంశాలే కాకుండా పాటలు కూడా ఆలోచింపజేసేవి. అవినీతి నేతల అణచివేత ధోరణులు, నిరుద్యోగ యువత ఇబ్బందుల్ని చిత్రాలు మలిచారు. మాదాల రంగారావుగారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. రంగారావు గారి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అంటూ సంతాపాన్ని తెలిపారు కథానాయకుడు పవన్ కళ్యాణ్.