అభిమన్యుడు ఆగమనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్ హీరో విశాల్ కథానాయకుడిగా విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై పి.ఎస్.మిత్రన్ దర్శకత్వంలో తమిళ్‌లో రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఇరుంబుతెరై’. ఇటీవల తమిళనాడులో విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ చిత్రాన్ని ‘అభిమన్యుడు’ పేరుతో ఎం.పురుషోత్తమన్ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై జి.హరి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. జూన్ 1న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ- మా అభిమన్యుడు సినిమా సెన్సార్ పూర్తయ్యింది. చాలా సంవత్సరాల తర్వాత రివ్యూస్ పరంగా, కలెక్షన్స్ పరంగా నాకు సంతృప్తినిచ్చిన చిత్రం ‘అభిమన్యుడు’. తమిళనాడులో సినిమా విడుదల చేసినపుడు సినిమాకు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగాయి. రెండు షోలు కూడా కాన్సిల్ అయ్యాయి. ఎగెనెస్ట్ డిజిటల్ ఇండియా, ఎగనెస్ట్ ఆధార్ కార్డ్ అని సినిమాకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేశారు. కానీ పోలీసులు మాకెంతో సపోర్టు చేశారు. సినిమా రిలీజైన తర్వాత ప్రేక్షకులకు నచ్చడంతో అన్ని పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాయి. ఈ సినిమాలో చూడబోయే విషయాలు షాకింగ్‌గా ఉంటాయి. ఏటిఎంలో జరిగే మోసాలు, బ్యాంక్స్ లోన్స్ తీసుకోవడంలో ఇబ్బందులు, సమాజంలో జరుగుతున్న విషయాలను ధైర్యంగా సినిమా రూపంలో మిత్రన్ డైరెక్ట్ చేశాడు. మంచి సినిమా ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు. సమంత రూపంలో మంచి హీరోయిన్ దొరికింది. అర్జున్ వైట్ డెవిల్ అనే పాత్రలో కనిపిస్తారు. నిజాలని చెప్పడానికి సినిమా అనే మీడియాని ఉపయోగించుకోవడంలో తప్పులేదు. ఇలాంటి విషయాలను చెప్పడానికి ధైర్యం అవసరం లేదు, బాధ్యత ఉంటే చాలు అని చెప్పాం అన్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ మాట్లాడుతూ అభిమన్యుడు మహాభారతంలో అల్టిమేట్ హీరో.. అలాగే అన్ సక్సెస్‌ఫుల్ హీరో. కానీ ఇక్కడ మా హీరో సక్సెస్‌ఫుల్. ఎందుకంటే ఈ చిత్రం తమిళనాడులో రిలీజై పెద్ద బ్లాక్‌బస్టర్ అయింది. మిత్రన్ తొలి చిత్రానే్న చక్కగా తెరకెక్కించారు. అందరికీ గ్యారంటీగా నచ్చుతుంది అన్నారు. సమంత మాట్లాడుతూ- తెలుగులో రంగస్థలం, మహానటి చిత్రాల తరువాత తమిళంలో ఈ చిత్రంతో సక్సెస్ అందుకున్నాను. ఇలాంటి సినిమాలో భాగమైనందుకు గర్వంగా ఉంది అన్నారు.