రికార్డింగ్‌లో డీల్ విత్ ధనలక్ష్మి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ గురు క్రియేషన్స్, విశ్వక్ సినిమా పతాకాలపై వెంకట్ ప్రసాద్ (బాబి) దర్శకత్వంలో ఎ.వి.ఎస్.శ్రీనివాస్, కవిత సింహాచలం రూపొందిస్తున్న చిత్రం ‘డీల్ విత్ ధనలక్ష్మి’. మానస్ కథానాయకుడుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పాటల రికార్డింగ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, సస్పెన్స్ థ్రిల్లర్‌గా సాగే ఈ చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుందని, వినోదప్రధానంగా సాగుతూ పదిమందికోసం పాటుపడే యువకుడి కథ ఇదని తెలిపారు. కథానాయకుడు తాననుకున్న లక్ష్యాన్ని చేరడానికి ఎంతదాకా వెళ్లాడు అనేదే ప్రధాన కథాంశమని, మానవ సంబంధాలకు విలువ ఇచ్చే ఈ పాత్ర ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని వారు తెలిపారు. ఈనెల 10నుండి 30 వరకు రాజమండ్రి, తాపేశ్వరం, సిద్ధాంతం పరిసర ప్రాంతాల్లో ఒక షెడ్యూల్ జరుపుతామని, ఏప్రిల్ 7నుండి 25వరకు హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్‌తో ఈ సినిమా పూర్తవుతుందని నిర్మాతలు తెలిపారు. కథ, స్క్రీన్‌ప్లే డిఫరెంట్‌గా సాగే ఈ చిత్రంలో తన పాత్ర వెరైటీగా ఉంటుందని మానస్ అన్నారు. పూజిత, అంజలి, అర్చన, విజయభాస్కర్‌రెడ్డి, సత్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జోస్యభట్ల, కెమెరా: ఎ.వి.శ్రీనివాస్, పాటలు: బాలభాస్కర్, శ్రీరామ్ తపస్వి, బాబి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకట్‌ప్రసాద్.