శ్రీశ్రీకి మహేష్ వాయిస్ ఓవర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణ, విజయనిర్మల ప్రధాన తారాగణంగా ఎస్.బి.ఎస్. ప్రొడక్షన్స్ పతాకంపై ముప్పలనేవి శివ దర్శకత్వంలో శ్రీ సాయిదీప్ చాట్ల, వై.బాలురెడ్డి, షేక్‌సిరాజ్ రూపొందించిన చిత్రం ‘శ్రీశ్రీ’. ఈ సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దర్శకుడు ముప్పలనేని శివ మాట్లాడుతూ.. కృష్ణ స్వర్ణోత్సవ సినిమాగా రూపొందించిన ఈ చిత్రానికి మహేష్‌బాబు వాయిస్ ఓవర్ చేయడం హైలెట్‌గా నిలుస్తుందని, అలాగే సుధీర్‌బాబు డిసిపి పాత్రలో చక్కగా నటించాడని తెలిపారు. క్లైమాక్స్‌లో వచ్చే ఈ పాత్ర అన్ని తరగతుల వారిని ఆకట్టుకుంటుందని, ఇప్పటికే ఆదిత్య మ్యూజిక్స్ ద్వారా ఆడియో విడుదలై, పాజిటివ్ టాక్‌ను పొందిందని ఆయన అన్నారు. శివరాత్రికి తొలి కాపీని సిద్ధంచేసి, సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసి, ఈనెల మూడోవారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. సినిమా ప్రారంభించినప్పటినుంచి తొలి కాపీ వచ్చేవరకు దర్శకుడు ముప్పలనేని శివ శ్రమించారని, ఆయన చెప్పినదానికన్నా వంద శాతం తెరపై ఆవిష్కరించారని, తప్పక విజయవంతవౌతుందని నిర్మాత సాయిదీప్ చాట్ల అన్నారు. నరేష్, సాయికుమార్, పోసాని కృష్ణమురళి, ఎల్బీశ్రీరామ్, తోటపల్లి మధు, దేవదాస్ కనకాల, మురళీశర్మ, కునాల్ కౌశిక్, అనితాచౌదరి, సోఫియా తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ: రమేష్ డియో ప్రొడక్షన్స్, సంగీతం: ఇ.ఎస్.మూర్తి, కెమెరా: సతీష్‌ముత్యాల, నిర్మాతలు: శ్రీసాయిదీప్ చాట్ల, వై.బాలురెడ్డి, షేక్ సిరాజ్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ముప్పలనేని శివ.