దండుపాళ్యాన్ని గుర్తుకుతెచ్చే వేటపాలెం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రశాంత్, లావణ్య, శిల్ప ప్రధాన తారాగణంగా హనీ, ప్రణి ఫిలిమ్స్ పతాకంపై నంది వెంకట్‌రెడ్డి దర్శకత్వంలో డా.ఎ.వి.ఆర్. రూపొందించిన చిత్రం ‘వేటపాలెం’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదలకు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, దర్శకుడు చెప్పిన కథ, కథనాలు నచ్చడంతో ఈ చిత్రాన్ని రూపొందించామని, సమాజానికి ఓ సందేశం అందించేలా నిర్మించిన ఈ సినిమా దండుపాళ్యం చిత్రాన్ని గుర్తుకు తెస్తుందని తెలిపారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. అనాధ పిల్లలు సమాజంలో ఎటువంటి నిరాదరణను ఎదుర్కొంటున్నారు? వారికి భవిష్యత్ ఎలా కనిపిస్తోంది? వారిని సరైన దారిలో పెట్టకపోతే నేరస్థులుగా మారుతున్నారన్న విషయాన్ని చెబుతూ క్రైమ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందించామని, సన్నివేశాలన్నీ మనస్సుకు హత్తుకునేలా వుంటాయని దర్శకుడు నంది వెంకట్‌రెడ్డి అన్నారు. సినిమాలో పాటలన్నీ బాగా వచ్చాయని, త్వరలో విడుదల చేయనున్నామని అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: డి.యాదగిరి, సంగీతం: ఎ.ఆర్.సన్నీ, పాటలు: నల్లరామకృష్ణారెడ్డి, మాటలు: గణేష్ ముత్యాల, నిర్మాత: డా.ఎ.వి.ఆర్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నంది వెంకట్‌రెడ్డి.