నా కల నెరవేరింది -- కళ్యాణ్‌రామ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి కళ్యాణ్‌రామ్ కెరీర్ ప్రారంభం నుండి ఆచి తూచి సినిమాలను ఎంచుకుంటూ స్లో అండ్ స్టడీగా సినిమాలు చేస్తున్నాడు. ఆ మధ్య వరుస పరాజయాలతో టెన్షన్ పడ్డ ఆయన కొన్ని రోజుల గ్యాప్ తరువాత ‘పటాస్’తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. అటు మాస్, ఇటు యాక్షన్ అంటూ అన్ని జోనర్‌లో సినిమాలు చేస్తున్న కళ్యాణ్‌రామ్ మొదటిసారి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. తమన్నాతో కలిసి అద్భుతమైన ప్రేమకథగా తెరకెక్కిన చిత్రం ‘నా నువ్వే’. జయేంద్ర దర్శకత్వంలో కూల్ బ్రేజ్ సినిమా పతాకంపై మహేష్ కోనేరు నిర్మించిన ఈ చిత్రం గురువారం విడుదలవుతున్న సందర్భంగా హీరో నందమూరి కళ్యాణ్‌రామ్‌తో ఇంటర్వ్యూ..
* కొత్త జోనర్ ట్రై చేసినట్టున్నారు?
- అవును.. ఇదొక రొమాంటిక్ మూవీ. ఇలాంటి సినిమా చేయడం నాకు ఫస్ట్ టైం. పీసీ శ్రీరామ్‌తో వర్క్ చేయడం నా అదృష్టం. గీతాంజలి టైమ్ నుంచి అనుకునేవాడ్ని, పి.సి.శ్రీరామ్‌తో వర్క్ చేయాలని. మొత్తానికి నా కల నెరవేరింది. కమర్షియల్ సినిమాల్లో మన బాడీ లాంగ్వేజ్ స్పీడ్‌గా వుంటుంది. కానీ ‘నా నువ్వే’ లాంటి రొమాంటిక్ సినిమాలు చేసేటప్పుడు, కొంచెం సటిల్‌గా ఉండాలి. కళ్లు పెద్దవి చేయకూడదు. హ్యాండ్ మూమెంట్స్ ఎక్కువ ఉండకూడదు. తల ఎక్కువ ఊపకూడదు. డైలాగ్స్ మధ్య గ్యాప్ ఇవ్వాలి. డైలాగ్ కంటే ఎక్స్‌ప్రెషన్ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ నాకు చాలా కొత్తగా అనిపించాయి.
* కాస్త కష్టంగా అనిపించిందా?
- ఈ క్యారెక్టర్‌తో సింక్ అవ్వడానికి నాకు చాలా టైం పట్టింది. మొదట లుక్ దగ్గరే చాలా కష్టపడ్డాం. జయేంద్ర అండ్ టీం చాలా కష్టపడింది. లుక్ ఫిక్స్ అయిన తర్వాత సటిల్ యాక్టింగ్ కోసం నేను కష్టపడాల్సి వచ్చింది. అన్నీ డౌన్ చేసి చూపించాలి. కొంచెం కష్టమైంది.
* దర్శకుడితో పనిచేయడం ఎలా ఉంది?
- నా క్యారెక్టర్ కోసం ఎవర్నీ ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోలేదు. పూర్తిగా డైరెక్టర్ జయేంద్ర మైండ్ నుంచి వచ్చిన పాత్ర ఇది. అతడు చెప్పినట్టు చేసుకుంటూ వెళ్లాను. ఒక్క ఎక్స్‌ప్రెషన్ ఎక్కువగా ఇచ్చినా కట్ చెప్పేసేవాడు. సినిమాలో నా పాత్రపై అతడికి అంత క్లారిటీ ఉంది. కెరీర్ మొదట్లో చేయాల్సిన సినిమా. కెరీర్ స్టార్టింగ్‌లో ఇలాంటి సినిమా చేసుంటే బాగుండేది. డైరెక్టర్‌ను కూడా అదే అడిగాను. అవకాశం ఇప్పుడొచ్చింది కాబట్టి చేస్తున్నాను. ఈ సినిమాలో నా లుక్ అందరికీ నచ్చింది. నా కొడుకు కూడా నేను చాలా అందంగా ఉన్నానని మెచ్చుకున్నాడు. నాకొచ్చిన పెద్ద కాంప్లిమెంట్ అదే. నేను మీసం తీసేయడం నా భార్యకు కూడా నచ్చింది.
* మీ పాత్ర గురించి?
- సినిమాలో నా పూర్తి క్యారెక్టర్ గురించి చెప్పలేను. సినిమా చూసి తెలుసుకోవాలి. నాది, తమన్నాదే కీలక పాత్రలు. అమెరికాలో జాబ్ కోసం వెళ్తున్న ఓ కుర్రాడిగా నేను కనిపిస్తాను. కాస్త స్వార్థం కూడా ఉంటుంది నా పాత్రలో.
* తమన్నాతో వర్క్ చేయడం?
- తమన్నాతో వర్క్ చేయడం చాలా బాగుంది. ఆమె చాలా ప్రొఫెషనల్. సెట్స్‌లో టైమ్‌కు ఉంటుంది. జయేంద్ర స్టయిల్ ఏంటంటే.. టోటల్ సీన్‌ను సింగిల్ షాట్‌లో తీయడం ఆయనకు అలవాటు. మొత్తం సీన్ అయిపోయిన తర్వాతే కట్ చెబుతారు. అందుకే తమన్నా, నేను షూటింగ్‌కు ముందు చాలా ప్రాక్టీస్ చేశాం. తమన్నాకు నాకు కామన్‌గా బ్లాక్ కాఫీ అంటే చాలా ఇష్టం. రెగ్యులర్‌గా కలిసి అదే తాగేవాళ్లం.
* వరుసగా సినిమాలు లైన్‌లో పెట్టారు?
- ఏడాదికి ఎన్ని సినిమాలు చేయాలనే టార్గెట్ నాకు లేదు. అంతా నా మైండ్ సెట్ ప్రకారం వెళ్లిపోతుంటా. ఒక సినిమా చేస్తున్నపుడు మరో కథ నచ్చితే వెంటనే చేసేస్తా. పైగా కాస్త ముందుగానే స్టోరీలైన్‌కు ఓకె చెబితే.. నేను ఫ్రీ అయ్యే టైమ్‌కు పూర్తిస్థాయిలో స్క్రీన్‌ప్లే రెడీ అవుతుంది. అలా టైం ఆదా అవుతుంది కదా.
* నెక్స్ట్ ఎలాంటి సినిమా చేస్తున్నారు?
- ప్రస్తుతం కె.వి.గుహన్‌తో ఓ సినిమా చేస్తున్నాను. అది పూర్తిగా కొత్త కానె్సప్ట్. అలాంటి క్యారెక్టర్, అలాంటి సినిమా ఇప్పటివరకూ నేను చేయలేదు. అంతా నచ్చింది కాబట్టే చేస్తున్నాను. నేను కొత్త పాత్రలు చేయాలి, కొత్తగా కనిపించాలి. భవిష్యత్తులో కూడా రొమాంటిక్ స్టోరీస్ వస్తే ఖచ్చితంగా చేస్తాను. ఏదో ఒక ఫ్రేమ్‌కు ఫిక్స్ అయిపోవడం నాకిష్టం ఉండదు.
* కమర్షియల్ హీరోకు రొమాంటిక్ హీరోకు తేడా ఏమిటి?
- కమర్షియల్ హీరోకు, రొమాంటిక్ హీరోకు చాలా తేడా వుంటుంది. కమర్షియల్ హీరోకు ఫిజికల్‌గా కష్టం ఉంటుంది. ఫైట్స్ చేయాలి, దూకాలి, అరవాలి. అదే రొమాంటిక్ హీరో విషయానికి వస్తే అంతా మైండ్ వర్క్ వుంటుంది. మనసులోనే ఆలోచించుకొని యాక్ట్ చేయాలి. ఎందులో కష్టం అందులో వుంది. రెండూ రెండే. కాకపోతే హీరోయిన్‌తో కెమిస్ట్రీ వర్కవుట్ అయితే రొమాంటిక్ హీరోగా చేయడం ఈజీ.
* తారక్‌తో సినిమా ఎప్పుడు?
- వచ్చే ఏడాది తారక్‌తో కూడా సినిమా ఉంటుంది.
* తదుపరి చిత్రాలు?
- గుహన్ సినిమా దాదాపు సగం పూర్తయింది. జూలైతో అది 50 శాతం షూటింగ్ పూర్తవుతుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై పవన్ సాధినేని దర్శకత్వంలో సినిమా వుంటుంది. స్టోరీ ఓకె అయింది. గున్నం గంగరాజు డైలగ్స్, స్క్రీన్‌ప్లే విభాగాలుల చూసుకుంటారు. ఇదొక మల్టీస్టారర్ మూవీ. ఎవరైతే బాగుంటుందో నాలుగు పేర్లు చెప్పమని అడిగాను.

- శ్రీ