‘హ్యాపీ వెడ్డింగ్’కోసం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యంగ్ రెబెల్‌స్టార్ ప్రభాస్‌తో అత్యంత భారీ వ్యయంతో 4 భాషల్లో ప్రతిష్ఠాత్మకంగా సాహో చిత్రాన్ని నిర్మిస్తున్న యువి క్రియేషన్స్ మరియు పాకెట్ సినిమా సంయుక్తంగా లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో యంగ్ హీరో సుమంత్ అశ్విన్, మెగా ప్రినె్సస్ నిహారిక కొణిదెల జంటగా నిర్మిస్తున్న సినిమా ‘హ్యాపీ వెడ్డింగ్’ యువి క్రియేషన్స్ బ్యానర్‌లో తొలిసారిగా సుమంత్ అశ్విన్ నటిస్తున్నారు. సుమంత్ అశ్విన్, నిహారిక మధ్య జరిగే సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. మ్యూజికల్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన ఈ చిత్రానికి బ్లాక్‌బస్టర్ హిట్ మూవీస్‌కి అద్భుతమైన సంగీతం అందించిన తమన్ రీ రికార్డింగ్ చేస్తుండడం విశేషం. రీరికార్డింగ్‌లో తమన్ మార్క్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరోవైపు ఫిదా చిత్రంతో సంగీత ప్రియులకు మంచి మ్యూజికల్ ఫీస్ట్ వెడ్డింగ్ మ్యూజికల్ బ్లాక్‌బస్టర్‌గా నిలవనుంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ... తెలుగు సినిమా పరిశ్రమలో వరుస విజయాలు సాధిస్తున్న క్రేజీ బ్యానర్ యువి క్రియేషన్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థతో కలిసి మేము ‘హ్యాపీ వెడ్డింగ్’చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. సుమంత్ అశ్విన్, నిహారిక జంటగా నటిస్తున్నారు. ఫిదా లాంటి మ్యూజిక్ ఛార్ట్‌బస్టర్‌ని అందించిన శక్తికాంత్ కార్తిక్ మా చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పుడు ఈ హ్యాపీ వెడ్డింగ్ ప్రాజెక్టులోకి తమన్ ఎంటర్‌అయ్యారు. తనదైన రీరికార్డింగ్‌తో మెస్మరైజ్ చేయబోతున్నారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్‌ప్రొడక్షన్‌లో బిజీగా వుంది. లక్ష్మణ్ కార్య మంచి విజన్ ఉన్న దర్శకుడు. పెళ్ళి కుదిరిన రోజునుండి పెళ్ళి జరిగే రోజువరకు రెండు కుటుంబాల మధ్య, రెండు మనసుల మధ్య ఏం జరుగుతుందనే విషయాన్ని చాలా అందంగా మా దర్శకుడు తెరకెక్కించాడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి అనుభవం జరిగి వుంటుంది. ప్రతి ప్రేక్షకుడు తమని తాము చూసుకునేలా రూపొందిన చిత్రమిది. త్వరలోనే విడుదలకు సిద్ధంగాఉన్న హ్యాపీ వెడ్డింగ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల్ని అలరిస్తుంది అని అన్నారు. నటీనటులు: సుమంత్ అశ్విన్, నిహారిక, నరేష్, మురళి శర్మ, పవిత్ర లోకేష్, తులసి, ఇంద్రజ, మధుమణి తదితరులు.