సిద్ధమైన ధనాధన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

థర్డ్‌ఐ పోస్ట్‌ప్రొడక్షన్ స్టూడియోస్ పతాకంపై వైభవ్, రమ్యానంబిసన్ జంటగా తెరకెక్కిన చిత్రం ధనాధన్. శ్రీ దర్శకత్వంలో డా.శివ వై.ప్రసాద్, శ్రీనివాస్ అనంతనేని ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నారు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం గూర్చి దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ, ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి తన ఉద్యోగం పోవడంవల్ల జీవితంలో ఎదురైన అనేక పరిణామాల నేపధ్యంలో ఈ చిత్రం సాగుతుందని తెలిపారు.
తాము అనుకున్నదానికన్నా సినిమా డబ్బింగ్ పరంగా బాగా వచ్చిందని, తెలుగు నేటివిటీకి దగ్గరగా మార్పులు చేర్పులు చేశామని వారు తెలిపారు. ఇటీవల విడుదలైన ఆడియోకు మంచి స్పందన లభిస్తోందని, ఈ సినిమాకు థమన్ అందించిన నేపథ్యం సంగీతం హైలెట్‌గా నిలుస్తుందని వారు తెలిపారు. కోట శ్రీనివాసరావు, షాయాజీషిండే విలన్లుగా నటించిన ఈ చిత్రం కామెడీ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని వారు తెలిపారు. ఛార్లి, ప్రవీణ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: శివపార్వతి, కెమెరా: ఎ.ఎమ్.ఎడ్విన్, సాకే, సంగీతం: ఎస్.ఎస్.్థమన్, నిర్మాతలు: డా.శివ వై.ప్రసాద్, శ్రీనివాస్ అనంతనేని, కథ, దర్శకత్వం: శ్రీ.