ఆయుష్మాన్‌భవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చరణ్‌తేజ్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో నేనులోకల్ చిత్ర దర్శకుడు త్రినాథ్‌రావు నక్కిన స్టోరీ, దర్శకత్వ పర్యవేక్షణలో ప్రముఖ దర్శకుడు మారుతి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం ఆయుష్మాన్‌భవ. ఈ చిత్రాన్ని సి.టి.ఎఫ్ నిర్మాణ బాధ్యతలు నిర్వహించారు. ప్రముఖ రచయితలు పరుచూరి బ్రదర్స్ కథనంతో రూపొందుతున్న ఈ చిత్రానికి బాలీవుడ్‌లో బేబి డాళ్, హేంగ్ ఓవర్, హైహీల్స్ లాంటి సూపర్బ్ సాంగ్స్ కంపోజ్ చేసిన మీట్ బ్రోస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ హీరోయిన్ స్నేహఉల్లాల్ చరణ్‌తేజ్ సరసన నటిస్తుంది. సమాజం ప్రేమని చూసే పద్ధతి మారాలి అనే కమర్షియల్ పాయింట్‌లో తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలచేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ఈనెల 21న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా చరణ్‌తేజ్ మాట్లాడుతూ... ముందుగా ఈ చిత్రానికి ఇంత మంచి కథని అందించటమే కాకుండా దర్శకత్వ పర్యవేక్షణచేస్తున్న సూపర్ సక్సెస్‌ఫుల్ దర్శకుడు త్రినాథ్‌రావు నక్కినగారికి, స్క్రీన్‌ప్లే అందించిన ప్రముఖ రచయితలు పరుచూరి బ్రదర్స్‌కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే క్రేజి దర్శకుడు మారుతిగారి మా చిత్రానికి సహ నిర్మాతగా బాధ్యతలు స్వీకరించినందుకు వారికి నా ధన్యవాదాలు. మేము అడిగిన వెంటనే మా కథ నచ్చి మా చిత్రంలో హీరోయిన్‌గా చేస్తున్న స్నేహ ఉల్లాల్ థ్యాంక్స్. స్నేహఉల్లాల్ పాత్ర చాలాబాగా డిజైన్ చేశాము. బాలీవుడ్ సూపర్ మ్యూజిక్ దర్శకుడు మీట్‌బ్రోస్ మ్యూజిక్ అందిస్తున్నారు. మన తెలుగు స్టేట్స్‌లో మీట్‌బ్రోస్ అందించిన ఆడియోను యూత్ విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు డైరెక్ట్‌గా వాళ్ళు మా చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి కులం, మతం వేరైతే.. మర్చిపోవాలా.. పారిపోవాలా.. చచ్చిపోవాలా.. ప్రపంచం ఏమైతే నాకేంటి సమాజం ప్రేమని చూసే విధానంమారాలి లేకపోతే చంపేస్తా.. అనుకునే హీరో క్యారక్టరైజేషన్‌తో ఈ చిత్రతం తెరకెక్కింది. ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ఈనెల 21న ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావుగారి 75వ జన్మదినం సందర్భంగా ఆయుష్మాన్‌భవ టీజర్ విడుదల చేస్తున్నాం.