కన్నుల్లో నీ రూపమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందు, తేజస్విని ప్రకాష్ జంటగా ఎఎస్‌పి క్రియేటివ్ బ్యానర్‌పై బిక్స్ ఇరుసర్ల దర్శకత్వంలో భాసాని నిర్మిస్తున్న చిత్రం ‘కన్నుల్లో నీ రూపమే’. నిర్మాణానంతర పనులన్నీ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈనెల 29న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు బిక్స్ ఇరుసడ్ల మాట్లాడుతూ- ‘మా చిత్రాన్ని 29న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం. నిర్మాతలు ఎస్.శ్రీకాంత్‌రెడ్డి, రామ్మోహనరావు ఈ చిత్రానికి చక్కటి సహకారం అందించడమేగాక, మా సినిమాతో అసోసియేట్ అవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సాకేత్ అందించిన ఆడియోకు మంచి స్పందన లభించింది. ట్రైలర్‌కు కూడా విశేష ఆదరణ లభించింది. నందు కెరియర్‌లో ఒక డిఫరెంట్ మూవీ. తేజస్విని ప్రకాష్ నటన అందర్నీ ఆకట్టుకుంటుంది. హాయిగా ఫ్యామిలీ థియేటర్‌కు వచ్చి నవ్వుల్లో మునిగియే చిత్రం ఇది’ అన్నారు. నిర్మాత భాస్కర్ భాసాని మాట్లాడుతూ- మా చిత్రానికి అందరి సహకారం ఆశిస్తున్నాం అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాకేత్ కోమండురి, సినిమాటోగ్రఫీ: ఎన్.బి. విశ్వకాంత్, సుభాష్ దొంతి, కొరియోగ్రాఫర్: ఆట సందీప్, పాటలు: అనంత శ్రీరామ్, శ్రీమణి, సమర్పణ: రాజవౌళి, అసోసియేట్: హరిహర చలనచిత్ర, నిర్మాత: భాస్కర్ భాసాని, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: బిక్స్ ఇరుసర్ల.