పాటల్లో బంగారి బాలరాజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాఘవ్, కరోణ్య కత్రిన్ హీరో హీరోయిన్‌లుగా నంది క్రియేషన్స్ పతాకంపై కె.యం.డి.రఫీ, రెడ్డం రాఘవేంద్రరెడ్డి నిర్మాతలుగా కోటేంద్ర దుద్యాల దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘బంగారి బాలరాజు’. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ లాంచింగ్ గ్రాండ్‌గా రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ వేడుకకు ముఖ్యఅతిథులుగా ప్రముఖ నిర్మాత, ఆంధ్రప్రదేశ్ ఎఫ్‌డిసి చైర్మన్ అంబికా కృష్ణ, సురక్ష కంపెనీస్ గ్రూప్ ఆఫ్ డైరెక్టర్ పద్మజ మానేపల్లి పాల్గొన్నారు. అంబికా కృష్ణ ట్రైలర్‌ను లాంచ్ చేయగా, పద్మజ మానేపల్లి ఆడియో సీడీలను విడుదల చేశారు. అనంతరం అంబికా కృష్ణ మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాల్లో పాటలతో పోల్చుకుంటే బంగారి బాలరాజు సినిమాలోని అన్ని పాటలు చాలా బాగున్నాయి. కొత్తవారైన సంగీత దర్శకులు చిన్ని కృష్ణ, చిట్టిబాబు రెడ్డిపోగు చాలా చక్కని సంగీతాన్ని అందించారు. అలాగే ట్రైలర్ చాలా బాగా వచ్చింది. ఈ ట్రైలర్ చూడగానే నాకు అర్ధమైంది డైరెక్టర్ కోటేంద్ర ఎంత కష్టపడ్డారో. ఖచ్చితంగా ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుంది. హీరో రాఘవ్‌కు మంచి భవిష్యత్తు ఉంది. అని టీంకు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే చిన్న సినిమాలు నిర్మించే వారికి ఒక వరాన్ని ప్రకటించారు. అదేమిటంటే 4 కోట్ల లోపు నిర్మించే ప్రతి చిత్రానికి 10 లక్షల రూపాయల సబ్సిడీతోపాటు పన్ను రాయితీ కూడా ఉంటుంది. సినిమా పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించాలి. ఈ విషయాన్ని అంబికా కృష్ణ బంగారి బాలరాజు వేదిక మీద ప్రకటించడం గమనార్హం. దర్శకుడు కోటేంద్ర దుద్యాల మాట్లాడుతూ... ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్‌కు ముఖ్యఅతిథిగా అంబికాకృష్ణ రావడం చాలా ఆనందంగా ఉందని, వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సినిమా బాగా వచ్చిందని బంగారి బాలరాజు సినిమా అన్ని వర్గాల వారికి నచ్చేలా ఉంటుందని త్వరలో సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని తెలియజేశారు. నిర్మాతలు కె.యమ్.డి.రఫీ, రెడ్డం రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ బంగారి బాలరాజు సినిమా ట్రైలర్‌ను అంబికా కృష్ణ చేతుల మీదుగా విడుదల చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. ఈ చిత్రం ఖచ్చితంగా అందరినీ అలరిస్తుందని అన్నారు.