అల్లు శిరీష్ ఎబిసిడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లు శిరీష్ కథానాయకుడిగా మలయాళంలో సూపర్ సక్సెస్ అందుకున్న ఎబిసిడి చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఫిల్మ్‌నగర్ దైవ సన్నిధానంలో జరిగింది. ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్ హీరో, హీరోయిన్లపై క్లాప్‌నివ్వగా సురేష్‌బాబు కెమెరా స్విచ్చాన్ చేశారు. శిరీష్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. సంజీవ్‌రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టును మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మధుర శ్రీ్ధర్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్‌పై యశ్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలనటుడిగా మనల్ని ఎంటర్‌టైన్ చేసిన మాస్టర్ భరత్ అల్లు శిరీష్ స్నేహితుడిగా ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ పోషిస్తున్నాడు. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ సంగీతం సమకూరుస్తున్నారు. అల్లు శిరీష్, రుక్సార్ తిల్లాన్, భరత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు మధుర శ్రీ్ధర్, యశ్ రంగినేని, దర్శకుడు సంజీవ్‌రెడ్డి.