ఇదొక ఫ్యామిలీ డ్రామా-- దర్శకుడు జె.బి.మురళీకృష్ణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనివాసరెడ్డి, సిద్ధి ఇద్నానీ హీరో హీరోయిన్లుగా శివ సెల్యులాయిడ్స్, మెయిన్ లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై జె.బి.మురళీకృష్ణ (మను) దర్శకత్వంలో రవి, జోజో జోస్, శ్రీనివాస్‌రెడ్డి.ఎన్ నిర్మిస్తున్న చిత్రం ‘జంబలకిడి పంబ’. ఈనెల 22న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు జె.బి.మురళీకృష్ణ చెప్పిన విశేషాలు...
నేను పుట్టింది పెరిగిందంతా విజయనగరం. మా నాన్నగారు మలయాళీ, అమ్మ తెలుగు కుటుంబానికి చెందినవారు. నేను విక్రమ్ కుమార్ వద్ద ‘మనం’కు సపోర్టింగ్ రైటర్‌గా పనిచేశాను. ‘దృశ్యం’ సినిమాను మలయాళం, తెలుగు, తమిళ వెర్షన్స్‌కు పనిచేశాను. దర్శకత్వ శాఖలో పనిచేస్తూనే ఓ చిన్న పాత్రలో కూడా నటించాను. ఈ కథను నేను 116 మందికి నేరేషన్ ఇచ్చాను. అందరికీ నచ్చింది కానీ రెండో సగంలో ఆత్మలు మారడం అనేది ఛాలెంజింగ్ పార్ట్ కావడంతో సినిమా ప్రారంభంకావడానికి ఆలస్యమైంది. ఈ కథను ముందు ఈ సినిమా సహ నిర్మాత సురేశ్ విన్నారు. అయితే పూర్తి బడ్జెట్ పెట్టలేనని ఆయన అన్నారు. తర్వాత కథను చాలామందికి వినిపిస్తూ వచ్చాను. 115వ వ్యక్తి నిర్మాత రవి. 116వ వ్యక్తిగా నిర్మాత జో జో విన్నారు. ఈ కథకు ‘కుడి ఎడమైతే’ అనే టైటిల్ అనుకున్నాను. అయితే శ్రేయోభిలాషులు కథ విని ఆత్మలు మారే కథ కాబట్టి ‘జంబలకిడి పంబ’ అనే టైటిల్ పెట్టు. కాస్త మైలేజ్ వస్తుందన్నారు. అయితే ఆ టైటిల్ పెట్టేటప్పుడు.. ఇపుడు భయంగానే ఉంది. పాత ‘జంబలకిడి పంబ’ రేంజ్‌ను ఊహించుకుని ప్రేక్షకులు వస్తారేమోనని భయంగా ఉంది. ఆ రేంజ్ చేస్తామని చెప్పడం అహంకారం అవుతుంది.

ఎందుకంటే అది బెంచ్ మార్క్ మూవీ. ఆ పేరు మా సినిమాకు పెట్టినందుకు ఆ స్థాయిలో ఉంటుందని చెప్పను కానీ.. పేరు మాత్రం పోగొట్టను అని చెప్పగలను. ఇదొక ఫ్యామిలీ డ్రామా. కథ రాసుకునేటప్పుడు నేటి యూత్‌ను బేస్ చేసుకుని కుటుంబాలు ఎలా ఉంటున్నాయని రాసుకున్నాను. బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేశాను. శ్రీనివాస్‌రెడ్డితో సినిమా అనుకోగానే కాస్త కామెడీ యాంగిల్‌లో చిన్న చిన్న మార్పులు చేశాను. సినిమా చేసేటప్పుడు ఆయన అయితేనే న్యాయం చేయగలరు అనిపించింది. ఎందుకంటే స్ర్తిలాగా నటించేటపుడు వారి హావభావాలు పలికించడం సాధారణ విషయం కాదు. హీరోయిన్ సిద్ధిని మేం ఆడిషన్స్ ద్వారా తీసుకున్నాం. మేం మొత్తం 36 మందిని ఆడిషన్స్ చేస్తే తను రెండో అమ్మాయి. ఈ అమ్మాయిని ఆడిషన్ చేయగానే ఫిక్స్ అయిపొమ్మని నా అసిస్టెంట్స్‌తో చెప్పాను. తను థియేటర్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చింది. తెలుగు నేర్చుకుని డైలాగులు చెప్పాలని, ప్రాంప్టింగ్ చెప్పమని ముందే చెప్పాం. తను కూడా అంతే కష్టపడి చెప్పింది. అలాగే ఎమోషన్స్‌ని పలికించింది. నా తొలి చిత్రం రైట్ రైట్ సరిగా ఆడలేదు. నాకు ఎంఎస్ రాజుతో చాలా మంచి అసోసియేషన్ వుంది. ఆయన చాలా చూసుకునేవారు. ఆయన చెప్పడంతో ఈ రీమేక్ చేశాను. తొలి సినిమా రీమేక్ చేద్దామా వద్దా అని అనుకున్నా. కానీ అవకాశం పిలిచి ఇవ్వడమంటే మామూలు విషయం కాదు అని నాకు తెలుసు. అందుకే అంగీకరించా. మలయాళంలో హిట్ అయిన సినిమా అది. ఎందుకో మన ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. ఇక ఈ సినిమా తర్వాత నేను ఇంకా ఏమీ ఆలోచించలేదు. నా ప్రెజెంట్, ఫ్యూచర్ ఇదే. రెండు మూడు అవకాశాలు వచ్చాయి. బౌండెడ్ స్క్రిప్ట్‌లు ఐదు ఉన్నాయి, చూడాలి అన్నారు.