29న సంజీవని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొట్టమొదటిసారిగా మోషన్ పిక్చర్ టెక్నాలజీని సమర్థవంతంగా వాడి, దాదాపు 1000 షాట్స్ విఎఫ్‌ఎక్స్ చేసిన చిత్రం సంజీవని. ఇలాంటి చిత్రాలు కేవలం హాలీవుడ్‌లో మాత్రమే వస్తాయి. కానీ మొట్టమొదటిసారి ఎన్నో కష్టాలు భరించి దర్శకుడు రవి వీడే, నిర్మాత జి.నివాస్‌లు దాదాపు రెండు సంవత్సరాలు ఇష్టంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మనోజ్ చందర్, అనురాగ్ దేవ్, శే్వత ప్రధాన పాత్రల్లో అనేకమంది హాలీవుడ్ టెక్నీషియన్స్‌తో పది అడుగుల సాలెపురుగులు, భారీ కోతులు, గాల్లో ఎగిరే బల్లులు ఇలా రకరకాల జంతువుల్ని క్రియేట్ చేసి ప్రేక్షకుల్ని అబ్బురపరిచేందుకు జూన్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా లక్ష్మి పిక్చర్స్ ద్వారా బాపిరాజు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు రవి వీడే మాట్లాడుతూ- మనం చిన్నతనం నుండి రకరకాల జంతువుల్ని గ్రాఫిక్స్‌లో చూశాం. కానీ ఇపుడు మా సంజీవని చిత్రంలో మాత్రం చాలా కొత్తగా అంటే యాక్షన్ అబ్బురపరిచేలా వుంటాయి. గ్రాఫిక్స్ కూడా ఏదో చేశామంటే చేశామని కాకుండా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా షూట్ చేశాం. మొట్టమొదటిసారిగా భారతదేశంలో హాలీవుడ్ టెక్నీషియన్స్‌తో కలిసి రెండు సంవత్సరాలు తెలుగులో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని వాడి దాదాపు 1000కిపైగా విఎఫ్‌ఎక్స్ షాట్స్‌తో, ఇండియాలోనే కాకుండా కెనడా, ఆఫ్రికా, నేపాల్ దేశాల్లో అత్యద్భుతంగా నిర్మించిన చిత్రం సంజీవని. ఈ చిత్రం టీజర్‌ని, ట్రైలర్‌ని, ఆడియోని విడుదల చేశాము. మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జూన్ 29న విడుదలకు సిద్ధమవుతోంది అన్నారు. లక్ష్మి పిక్చర్స్ అధినేత బాపిరాజు మాట్లాడుతూ ఫ్యామిలీ ఆడియన్స్ అమితంగా ఇష్టపడే చిత్రంగా సంజీవిని వుంటుంది. టీజర్, ట్రైలర్ చూసినవారంతా ఆశ్చర్యంతో ఇది హాలీవుడ్ చిత్రం అనుకుంటున్నాం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాం అన్నారు.