పేపర్‌బాయ్ చిత్రీకరణ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపత్ నంది టీమ్‌వర్క్స్, ప్రచిత్ర క్రియేషన్స్, బి.ఎల్.ఎన్. సినిమా పతాకాలపై సంపత్ నంది, వెంకట్, నరసింహ నిర్మించిన సినిమా ‘పేపర్ బాయ్’. సంతోష్ శోభన్, ప్రియాశ్రీ, తన్యహోప్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి జయశంకర్ దర్శకత్వం వహించారు. టాకీపార్ట్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. హైదరాబాద్, ముంబాయి, లోనవాల, పూణే, కేరళ, గోవా వంటి నగరాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంది. పోస్ట్‌ప్రొడక్షన్ చివరి దశోవున్న ఈ చిత్రాన్ని జూలైలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దర్శకుడు సంపత్ నంది పుట్టినరోజు సందర్భంగా జూన్ 20న ‘పేపర్ బాయ్’ ఫస్ట్‌లుక్ విడుదల కానుంది. సంతోష్ శోభన్, ప్రియాశ్రీ, తన్యహోప్, పోసాని కృష్ణమురళి, బిత్తిరి సత్తి, విద్యుల్లేఖ రామన్, జయప్రకాష్‌రెడ్డి, అన్నపూర్ణమ్మ, అభిషేక్ మహర్షి, మహేష్ చిట్టా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్, ఎడిటర్: తమ్మిరాజు, సినిమాటోగ్రఫీ: సుందర్ రాజన్, ఆర్ట్: రాజీవ్, స్క్రిప్ట్ కోఆర్డినేటర్: సుధాకర్ పావులూరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళి మామిళ్ల.