సమంత ‘యు టర్న్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుసగా సక్సెస్‌ఫుల్ చిత్రాల్లో నటిస్తున్న సమంత ప్రస్తుతం ‘యు టర్న్’ సినిమాలో నటిస్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. సమంత ఈ సినిమాలో జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుంది. తాజాగా హైదరాబాద్‌లో ఒక షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఒక పోలీస్‌స్టేషన్ సెట్‌లో జరుగుతోంది. ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాలో నటిస్తున్నారు. పవన్‌కుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి నికేత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలో సమంత ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. సమంత, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక చావ్లా, అడుకలం నరేన్, రవిప్రకాష్, బిర్లాబోస్, ఛత్రపతి శేఖర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకత్వం: పవన్‌కుమార్, నిర్మాత: శ్రీనివాస్ చిట్టూరి, బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్, సినిమాటోగ్రఫీ: నికేత్.