పాటల స్కెచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశుక్ర క్రియేషన్స్ పతాకంపై నర్సింగ్ మక్కల, ఇంద్ర, సమీర్‌దత్త, కార్తీకరెడ్డి, చక్రి మాగంటి, సోఫియాసింగ్, గ్యారీ టాన్‌టోని ముఖ్యపాత్రల్లో రవి చావలి దర్శకత్వంలో బలరామ్ మక్కల, పద్మనాభరెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘సూపర్ స్కెచ్’. ఈ చిత్రంలోని పాటలు బుధవారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ప్రముఖ దర్శకుడు సురేందర్‌రెడ్డి పాటల సీడీని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ- ది ఎండ్, సామాన్యుడు వంటి చిత్రాలతో రవి చావలి దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. ఆ రెండు సినిమాలు నాకు చాలా ఇష్టం. ఈ సినిమా కూడా మంచి కానె్సప్టుతో తెరకెక్కించాడు. తప్పకుండా సక్సెస్ కావాలి అన్నారు. దర్శకుడు రవి చావలి మాట్లాడుతూ- డ్రగ్స్‌కి బానిసలైన నలుగురు తెలివైన క్రిమినల్స్ అందరి దగ్గరా మంచిగా నటిస్తూ పోలీసులకు చెమటలు పట్టిస్తారు. అలాగే రాజకీయ నాయకుల సపోర్టుతో వాళ్లను పోలీసులు ఏం చేయలేరు. కానీ నిజాయితీగల పోలీసు అధికారి వారిని ఎలా అడ్డుకున్నాడన్న ఆసక్తికర అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ చిత్రాన్ని జూన్ 29న విడుదల చేస్తామన్నారు. నిర్మాత నర్సింగ్ మక్కల మాట్లాడుతూ- సినిమాపై చాలా నమ్మకముంది. ఈనెల 29 నుంచి తెలంగాణలో డైలాగుల పండుగ రానుంది. తప్పకుండా మా సినిమాని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని కోరకుంటున్నానన్నారు.