మరి గాంధీ సంగతేంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంచలన దర్శకుడు రాంగోపాల్‌వర్మ రూ పొందిస్తున్న తాజా చిత్రం ‘కిల్లింగ్ వీరప్పన్’. మూడు రాష్ట్రాల ప్రభుత్వాల్ని ముప్పుతిప్పలు పెట్టిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ జీవితగాథతో తెరకెక్కిన సినిమా ఇది. కన్నడంతోపాటు తెలుగు, హిందీ భాషల్లో విడుదలవుతోంది. కన్నడ హీరో శివరాజ్‌కుమార్ నటిస్తున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమైన సందర్భంగా ఈ చిత్రంపై వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి కోర్టులో కేసు పెట్టింది. ఆమె తన నోటీసులో ఈ సినిమా గురించి పేర్కొంటూ, లంచగొండి ప్రభుత్వం, నయవంచక అటవీ అధికారులనుండి అటవులను రక్షించడానికి తన జీవితాన్ని ధారపోసిన వీరప్పన్‌ని ఈ చిత్రంలో చెడ్డవాడిగా చూపించనున్నారని, చాలామంది తమిళులు వీరప్పన్‌ని దైవసమానుడిగా భావిస్తారని ఆమె పేర్కొన్నారు. ఈ చిత్రంలో వీరప్పన్‌ని చూపించే విధానంబట్టి రెండు రాష్ట్రాల ప్రజలమధ్యన పెద్ద ఎత్తున గొడవలు జరిగే అవకాశం వుందని, అలాగే, సెన్సార్ బోర్తుతో వర్మ చేతులు కలిపి నా భర్త కీర్తిప్రతిష్ఠలను పాడుచేయడానికి సిద్ధమవుతోంది అంటూ ఆమె కేసును ఫైల్ చేశారు. ఈ విషయంపై వర్మ స్పందిస్తూ, ప్రతి బిడ్డ తన తల్లికి ముద్దొచ్చినట్టుగానే, ప్రతి భార్య తన భర్త మంచివాడనే అనుకుంటుందని, ఒసామా బిన్‌లాడన్ భార్య కూడా తన భర్త కన్నా మంచివాడు ప్రపంచంలో లేడనుకుంటుందని, ఇదంతా బాగానే వుందిగానీ వీరప్పన్, ఒసామా బిన్‌లాడెన్ మంచివాళ్ళైతే మరి మహాత్మాగాంధీ గారి సంగతేంటి? ఇదే నా ప్రశ్న అంటూ ఆయన పేర్కొన్నారు.
మొత్తానికి ‘కిల్లింగ్ వీరప్పన్’ సినిమా ఈనెల 4న విడుదలవాల్సి వుండగా కేసు పెట్టిన దృష్ట్యా వాయిదా పడనుంది.