నిర్మల కానె్వంట్‌కు అతిథిగా నాగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్‌ను కథానాయకుడుగా పరిచయం చేస్తూ మ్యాట్రిక్స్ టీమ్‌వర్క్స్ పతాకంపై అన్నపూర్ణ స్టూడియోస్ రూపొందిస్తున్న యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ ‘నిర్మలా కానె్వంట్’. జి.నాగకోటేశ్వరరావు దర్శకుడుగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో శ్రేయాశర్మ కథానాయికగా నటిస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, ఓ అందమైన ప్రేమకథతో రూపొందుతున్న ఈ చిత్రంలో నాగార్జున ప్రత్యేక పాత్రలో నటిస్తారని, ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలపై ప్రత్యేక అంచనాలు ఉన్నాయని తెలిపారు. ఎ.ఆర్.రెహమాన్ తనయుడు అమీన్ నేపథ్య గాయకుడుగా పరిచయం అవుతున్నారని, ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తికావస్తోందని, త్వరలోనే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు. ఆదిత్యమీనన్, సత్యకృష్ణ, సూర్య, అనితాచౌదరి, సమీర్, తా.రమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాలూరి రోషన్, కెమెరా: ఎస్.వి.విశే్వశ్వర్, నిర్మాతలు: అక్కినేని నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.నాగకోటేశ్వరరావు.