జనవరి నుండి బోయపాటి సినిమా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ తాజాగా నటిస్తున్న అన్న నందమూరి తారక రామారావు బయోపిక్ రెగ్యులర్ షూటింగ్ జూలై 5 నుంచి మొదలుకానుంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తికావచ్చాయి. ఈ సినిమా తరువాత బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించేందుకు ఓకె చెప్పాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇదివరకే వచ్చిన సింహ, లెజెండ్ సంచలన విజయాలు అందుకోవడంతో ఈ కాంబినేషన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిజానికి బాలయ్య 100వ చిత్రం కోసం బోయపాటి శ్రీను ప్లాన్ చేశాడు కానీ, అది కుదరలేదు. తాజాగా రామ్‌చరణ్‌తో బోయపాటి తెరకెక్కిస్తున్న సినిమా ఆగస్టు వరకు పూర్తవుతుందట. ఆ తరువాత బాలకృష్ణ సినిమాపై దృష్టిపెట్టనున్నాడు. హ్యాట్రిక్ హిట్‌గా నిలిచే ఈ సినిమా జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడికానున్నాయి.