మహేష్ సరసన..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లేటెస్టుగా సమ్మోహనం సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో మంచి స్థానం సంపాదించుకున్న తెలుగు భామ అదితిరావు హైదరీకి వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. నటిగా, గ్లామర్ గాళ్‌గా గుర్తింపు తెచ్చుకున్న అదితిని తమ తమ సినిమాల్లో హీరోయిన్‌గా తీసుకునేందుకు పలువురు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సూపర్‌స్టార్ మహేష్ సరసన హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిందట. ఆ వివరాల్లోకి వెళితే మహేష్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహేష్ 25వ చిత్రం ఇటీవలే డెహ్రాడూన్‌లో ప్రారంభమైంది. ఇందులో హీరోయిన్‌గా పూజా హెగ్డే ఎంపిక అవ్వగా, మరో హీరోయిన్‌గా అదితిని తీసుకున్నారట. అదితి తక్కువ సమయంలోనే మహేష్ సరసన ఛాన్స్ కొట్టేయడం విశేషం. హిందీలో రెండు మూడు చిత్రాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ తెలుగు భామ టాలీవుడ్‌లోనే సెటిల్ అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.