క్వాలిటీయే ముఖ్యం -- నిర్మాత డి.సురేష్‌బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు చలనచిత్ర రంగంలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ అంటే ఓ రేంజ్ క్రేజ్ వున్న విషయం తెలిసిందే. ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించిన ఈ సంస్థ తాజాగా చిన్న చిత్రాల్ని కూడా నిర్మిస్తోంది. తాజాగా విష్వక్‌సేన్, సాయి సుశాంత్, వెంకట్, అభినవ్, అనీషా ఆంబ్రోస్, సిమ్రన్ చౌదరి ముఖ్యపాత్రల్లో తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఈ నగరానికి ఏమైంది చిత్రాన్ని నిర్మిస్తోం ది. ఈ చిత్రం ఈనెల 29న విడుదలవుతున్న సం దర్భంగా నిర్మాత సురేష్‌బాబు చెప్పిన విశేషాలు..
పెళ్లిచూపులు తరువాత..
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో పెళ్లిచూపులు తరువాత ఈ చిత్రాన్ని నాతో చేయడానికి వచ్చాడు. కథ సిద్ధం చేసుకున్నాక షూటింగ్ మొదలుపెట్టాడు. నేను రెండు మూడుసార్లు మాత్రమే షూటింగ్‌కు వెళ్లాను. నేటి యువత నేపథ్యంలో తెరకెక్కే కథ ఇది. ముఖ్యంగా షూటింగ్‌లోనే డైరెక్ట్ వాయిస్ రికార్డింగ్ జరుగుతుంది. మొదటిసారి పబ్‌లో షూటింగ్ అంటే భారీ సౌం డ్లు వుంటాయనుకున్నాను. కానీ ఎలాంటి సౌండ్ లేకుండా సినిమాను తీస్తున్నారు. నాకు చాలా ఆశ్చర్యమేసింది. ఇలాంటి టెక్నిక్‌తో సినిమా చేయడం మంచి పరిణామం. ఇలాంటి కొత్త ప్రాసెస్ వల్ల సినిమా మరో రేంజ్‌కి వెళుతుంది. తప్పకుండా ఇలాంటి వ్యక్తులు పరిశ్రమలో తమకంటూ ఓ మార్క్‌ను సృష్టించుకుంటారు.
క్వాలిటీ ముఖ్యం..
మన ఇండియన్ సినిమా విషయంలో ఎవ్వరు కూడా క్వాలిటీ గురించి పెద్దగా పట్టించుకోరు. మన ఇండియన్ సినిమాలు ఎందుకు హాలీవుడ్ రేంజ్‌లో ఆకట్టుకోలేకపోతున్నాయంటే దానికి ముఖ్య కారణం కంటెంట్ కాదు, క్వాలిటీ లేకపోవడమే. సౌండ్, ఫొటోగ్రఫి విషయాల్లో మనం అంతగా దృష్టి సారించం. అందుకే వాళ్లకు నచ్చదు. కానీ కొందరు అద్భుతంగా క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పనిచేస్తారు. ఈ విషయంలో రెహమాన్ ఒక్కడు. అందుకే ఆయన ఆస్కార్ అందుకున్నాడు.
డబ్బు ముఖ్యం కాదు..
మనం ఎంతసేపూ ఎంత డబ్బు పెట్టాం, ఎంత వచ్చింది అనేది మాత్రమే చూస్తాం. అంతే తప్ప క్వాలిటీకోసం ఎలాంటి ప్రయత్నాలు చెయ్యం. తెలుగులో కూడా లైవ్ రికార్డింగ్ అనేది మొదట్లో వుండేది. అది రాను రాను తగ్గిపోయింది. మళ్లీ ఈ సినిమాతో ఆ ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా ప్రేక్షకులకు ఓ కొత్త ఫీలింగ్ కలుగుతుంది. సినిమాలకు సంబంధించి అద్భుతమైన పరిజ్ఞానం అందుబాటులో వుంది. దాన్ని మనం వాడుకొని బెస్ట్ క్వాలిటీతో సినిమాల్ని ప్రేక్షకులకు అందిస్తే ఆ ఫలితాలు మరోలా వుంటాయి.
తదుపరి చిత్రాలు..
సురేష్ ప్రొడక్షన్ బ్యానర్‌లో ఎన్నో భారీ చిత్రాల్ని నిర్మించాం. ప్రస్తుతం చిన్న చిత్రాల్ని తీస్తున్నాం. వీటితోపాటు భారీ సినిమాలు కూడా వుంటాయి. ప్రస్తుతం వెంకటేష్, చైతులతో బాబి దర్శకత్వంలో ఓ భారీ సినిమా జూలైలో ప్రారంభం అవుతుంది. దాంతోపాటు రానా హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో హిరణ్య కూడా ప్రారంభం అవుతుంది. దాంతోపాటు ఓ కొత్త దర్శకుడితో పక్కా తెలంగాణ సినిమాను చిన్న బడ్జెట్‌లో నిర్మిస్తున్నాం. అలాగే మా ఫిలిం స్కూల్ ద్వారా ఔత్సాహికులైన వారికి కొత్త టెక్నాలజీ అందించాలనే ప్రయత్నాల్లో ఉన్నాం.