ఫన్ మొదలెట్టారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు వెంకటేష్, వరుణ్‌తేజ్ హీరోలుగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం ఎఫ్-2 చిత్రం హైదరాబాద్‌లో సంస్థ కార్యాలయంలో మొదలైంది. దేవుని పటాలపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా దిల్‌రాజు, వెంకటేష్ దర్శకుడికి స్క్రిప్ట్‌ను అందజేశారు. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను నిర్మాత తెలియజేస్తూ, ఎఫ్-2 ఫన్ అండ్ ప్రస్టేషన్ ఉపశీర్షికతో తెరకెక్కే ఈ చిత్రం జూలై 5 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. కమర్షియల్ విలువలతో కూడిన కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించే ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల చేస్తాం. వెంకటేష్ సరసన తమన్నా, వరుణ్ సరసన మెహరీన్‌లను హీరోయిన్లుగా ఎంపిక చేశాం అని తెలిపారు.