సైరా కోసం భారీపోటీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం హైదరాబాద్ శివార్లలో వేసిన భారీ సెట్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులతోపాటు సినీ వర్గాల్లో కూడా అంచనాలు ఆకాశాన్నంటాయి. నయనతార, అమితాబ్‌బచ్చన్, జగపతిబాబు, సుధీప్ లాంటి ప్రముఖ నటీనటులు నటిస్తున్న ఈ సినిమా హక్కుల కోసం భారీ పోటీ నెలకొందట. ఇప్పటికే రెండు మూడు సంస్థలు ఈ హక్కుల కోసం పోటీపడుతున్నట్టు తెలిసింది. ముఖ్యంగా ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వి క్రియేషన్స్ భారీ రేటుకు ఈ సినిమా థియేట్రికల్ హక్కులను తీసుకునేందుకు సిద్ధమైందని టాక్. మెగాస్టార్ కెరీర్‌లో అత్యంత భారీ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న సైరా చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. రామ్‌చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.