పాటల్లో లవర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌తరుణ్, రిద్ధికుమార్ జంటగా నటించిన చిత్రం ‘లవర్’. అనీష్ కృష్ణ దర్శకత్వం వహించారు. దిల్‌రాజు నిర్మాణ సారథ్యంలో శిరీష్ సమర్పణలో హర్షిత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆడియో వేడుక హైదరాబాద్‌లో జరిగింది. సీడీని సతీశ్ వేగేశ్న విడుదల చేశారు. దర్శకుడు అనీష్‌కృష్ణ మాట్లాడుతూ.. ‘‘ఇది నా రెండో సినిమా. నా తొలి సినిమా ‘అలా ఎలా’ మంచి హిట్ అయింది. దిల్‌రాజు సంస్థలో ఈ రెండో సినిమాను చేయడం చాలా ఆనందంగా ఉంది. నా తొలి సినిమాకు రాజుగారు బ్యాక్‌డోర్ సపోర్ట్ ఇచ్చారు. అది 50 రోజులు ఆడింది. ఈ సినిమాకు మెయిన్ ఎంట్రీ సపోర్ట్ ఇచ్చారు. దీని గురించి పెద్దగా మాట్లాడలేక పోతున్నాను. పోస్ట్ రిలీజ్ మాట్లాడతాను. ‘అలా ఎలా’ సినిమా చూసి ‘మంచి స్క్రిప్ట్‌పట్టాక సినిమా చేద్దాం’అని రాజుగారు అన్నారు. మూడున్నరేళ్ల తర్వాత ఒకసారి మెసేజ్ పెట్టి రాజుగారిని వెళ్లి కలిశాను. 20 నిమిషాలు కథ విని బావుందన్నారు’అని అన్నారు. రాజ్‌తరుణ్ మాట్లాడుతూ ‘ఇందాకా రాజా రవీంద్రగారు ఫస్ట్ సినిమాలాగా అనుకుంటాం అని అన్నారు. నాకు అలాగే ఉంది. తొలి సినిమా లాగానే అనుకుంటున్నా. సమీర్‌గారు లేకపోతే ఈ సినిమా లేదు. ఈ సినిమా రావడానికి కారణం ఆయనే. నా లుక్ మారడానికి, కొత్తగా ఉండటానికి కారణం హర్షిత్. నా గురించి నాకన్నా ఎక్కువ కేర్ తీసుకుంది హర్షిత్. నన్ను భరించినందుకు, ఈ సినిమాను ఇంత బాగా తీసినందుకు అనీష్‌కి ధన్యవాదాలు. సంగీత దర్శకులు అందరూ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆర్టిస్టులకు, టీమ్‌కి అందరికీ ధన్యవాదాలు. దిల్‌రాజుగారు నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థాంక్స్ అన్నారు. దిల్‌రాజు మాట్లాడుతూ.. ‘లాస్ట్‌ఇయర్ ఆరు సిక్స్‌లు, ఫోర్లు కొట్టి తర్వాతి బాల్ కొట్టేటప్పుడు బ్యాట్స్‌మేన్ ఎంత నెర్వస్‌గా ఫీలవుతాడో, ఇప్పుడు నా పరిస్థితి కూడా అలాగే ఉంది. ‘అలా ఎలా’ని ఫ్యామిలీ మెంబర్స్ 12మంది వెళ్లి చూశాం. హిలేరియస్‌గా ఎంజాయ్ చేశాం. ఒక ఐడియా ఉందని అనీష్‌కృష్ణ చెప్పాడు. రాజుగారు పిలిచాడు. నేను వెళ్లి చేసేశాను అని అనీష్ చాలా ఈజీగా చెప్పాడు. కానీ ఆ తర్వాత అంత ఈజీగా కాలేదు. ‘అలా ఎలా’ లాగే ఈ సినిమా కూడా ఎంటర్‌టైనింగ్ వేలో చేశాడు అన్నాడు.