రానా బాలీవుడ్ సినిమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భల్లాలదేవుడు రానాకి ఒక్క తెలుగులోనే కాదు హిందీలో కూడా మంచి క్రేజ్ వున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హిందీలో రెండు మూడు చిత్రాల్లో నటించిన రానాకు బాహుబలి మరింత పాపులారిటీని ఇచ్చింది. దాంతో రానాతో సినిమా చేయడానికి పలువురు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా కరణ్ జోహార్ దర్శకత్వంలో వరుణ్ ధావన్ హీరోగా నటించే ‘రన్ భూమి’ పేరుతో ఓ భారీ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రానా కీ రోల్ పోషిస్తున్నాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా జూలై చివరలో సెట్స్‌పైకి రానుంది. రానా హీరోగా హిరణ్య పేరుతో ఓ మైథలాజికల్ సినిమాను తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గుణశేఖర్ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కనుంది.