పర్వీన్ రాజ్ హీరోగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ప్లేయర్’ చిత్రంలో కథానాయకుడిగా నటించిన పర్వీన్‌రాజ్ లార్డ్ శివ క్రియేషన్స్ పతాకంపై రూపొందిస్తున్న తొలి చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఈనెల 18న అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభం కానుంది. శేషసాయి మరుప్రోలు దర్శకత్వంలో ఎం.వి.ఎస్.సాయికృష్ణారెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, యువత ఆలోచనలను ప్రధానంగా తీసుకుని యూత్‌ఫుల్ లవ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, సాక్షీ చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సమాజంలో ఓ సందేశం కూడా వుంటుందని తెలిపారు. 18న తొలి షెడ్యూల్ ప్రారంభించి హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో షెడ్యూల్స్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని దర్శకుడు సాయికృష్ణారెడ్డి అన్నారు. పోసాని కృష్ణమురళి, ఝాన్సీ, సప్తగిరి, చంటి, వేణు, అప్పారావు, రాకెట్ రాఘవ, జోష్ రవి, అల్లరి హరీశ్, ఆర్.పి. తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:కంతేటి శంకరరావు, సంగీతం:కిషన్ కవాడియా, ఎడిటింగ్:నందమూరి హరి, నిర్మాత:ఎం.వి.ఎస్. సాయికృష్ణారెడ్డి, కథ, మాటలు, పాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శేషసాయి మరుప్రోలు.