గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్ధార్థ్, లక్ష్మీమీనన్ జంటగా కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో గ్లోబల్ వన్ స్టూడియోస్, సాయి మణికంఠ క్రియేషన్స్ పతాకంపై కె.రమేష్ నిర్మిస్తోన్న చిత్రం ‘చిక్కడు దొరకడు’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత వివరాలు తెలియజేశారు. ‘కళావతి’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సిద్ధార్థ్, మొదటిసారిగా మాస్ సినిమాలో నటిస్తున్నాడని, యాక్షన్ నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్‌వార్‌గా తెరకెక్కే ఈ చిత్రంలో లక్ష్మీమీనన్ అద్భుతంగా నటించిందని అన్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం అనేక విభాగాల్లో ఫిలింఫేర్ అవార్డులను కూడా అందుకుంది. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ మంచి సంగీతాన్ని అందించాడు. సిద్ధార్థ్ కెరీర్‌లో విభిన్నమైన గెటప్‌లో కనిపించే ఈ సినిమా 11న భారీ స్థాయిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.