13న చినబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్తి, సయేష జంటగా నటించిన ‘చినబాబు’ సినిమాను ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర నిర్మాతలు నిర్ణయించారు. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్, పాటలకు మంచి స్పందన లభించింది. సత్యరాజ్ ముఖ్యపాత్రలో నటించిన ఈ సినిమా ట్రైలర్ త్వరలో విడుదల కానుంది. దర్శకులు పాండిరాజ్ రైతుల సమస్యలను ఈ సినిమాలో చర్చించారు. మొదటిసారి రైతు పాత్రలో కార్తి కనిపించబోతున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌లో కార్తి చెప్పిన డైలాగ్స్ ఆలోచింపచేసే విధంగా వున్నాయి. రైతుల సమస్యలను చర్చిస్తూనే సినిమాలో కామెడీ, యాక్షన్ ఉండబోతోంది. శత్రు ఈ చిత్రంలో మెయిన్ విలన్‌గా నటించారు. హీరో సూర్య, నిర్మాత మిరియాల రవీందర్‌రెడ్డి ‘చినబాబు’ సినిమాను 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్, ద్వారకా క్రియేషన్స్ బ్యానర్స్‌లో నిర్మించారు. ఈ చిత్రంలో కార్తి, సయేష, ప్రియా భవాని శంకర్, సత్యరాజ్, భానుప్రియ, సూరి, శంకర్, ఆర్థన బిసు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:పాండిరాజ్, నిర్మాతలు: సూర్య, మిరియాల రవీందర్‌రెడ్డి, సంగీతం: డి.ఇమాన్, కెమెరా: వేల్‌రాజ్, ఎడిటింగ్: రుబన్.