లిప్‌లాక్ చేస్తే తప్పేంటి? -- హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ జంటగా కెసిడబ్ల్యు బ్యానర్‌పై అశోక్‌రెడ్డి గుమ్మకొండ నిర్మించిన చిత్రం ‘ఆర్‌ఎక్స్ 100’. ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. యాన్ ఇన్‌క్రెడిబుల్ లవ్‌స్టోరీ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రం ఈనెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ చెప్పిన విశేషాలు.. ‘‘ఇంతకు ముందు నేను పంజాబీ సినిమాల్లో నటించాను. రీసెంట్‌గా సైరబ్ పంజాబీ రీమేక్‌లో నటించాను. ఆ సినిమాలో నా నటనకు ఫిలింఫేర్ అవార్డు కూడా వచ్చింది. సీరియల్స్‌లో కూడా నటించాను. ఆర్‌ఎక్స్ 100 నా తొలి చిత్రం. అజయ్ ఈ సినిమా కథను నారేట్ చేసినపుడు నా పాత్ర బాగా నచ్చింది. డిఫరెంట్‌గా ఉందనిపించింది. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్ర. తెలుగు భాషలో నటించడం ఎలా అని అనుకున్నాను. కానీ సెట్‌లో అడుగుపెట్టిన తర్వాత డైరెక్షన్ టీమ్.. ఇతర సభ్యుల సహకారంతో కష్టమనిపించలేదు. ప్రతి సీన్ గురించి అజయ్‌కి క్లారిటీ వుంది. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాను. నా రోల్ చిన్నదా పెద్దదా అని ఆలోచించను. పాత్ర ప్రాముఖ్యత గురించి ఆలోచిస్తాను. స్క్రిప్ట్‌లో భాగమైనందువల్లనే లిప్‌లాక్‌లో నటించాను. అందులో తప్పేం కనిపించలేదు. ఓ నటిగా స్క్రిప్ట్‌కు న్యాయం చేయడం నా బాధ్యతగా భావించాను. కార్తికేయ మంచి మిత్రుడే కాదు మంచి వ్యక్తి కూడా. మంచి కో స్టార్. ఇపుడు తెలుగు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. సెప్టెంబర్‌లో ఓ తెలుగు సినిమా చేయబోతున్నాను. తెలుగులో నాకు ప్రభాస్ అంటే ఇష్టం. ఆయనతో భవిష్యత్తులో తప్పకుండా కలిసి నటిస్తాననే నమ్మకం ఉంది’’ అని పేర్కొంది.