కోతలరాయుడిగా శ్రీకాంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటరమణ మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. శ్రీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో డింపుల్ చోపడే, నటాషాదోషి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. డింపుల్ చోపడే సునీల్ ‘కృష్ణాష్టమి’ చిత్రంలో నటించింది. అలాగే నటాషాదోషి బాలకృష్ణ ‘జై సింహ’ సినిమాలో నటించింది. సుధీర్‌రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కొలన్ వెంకటేష్ నిర్మిస్తున్నారు. గతంలో సుధీర్‌రాజు సుబ్బరాజుతో ‘జయహే’ చిత్రానికి దర్శకత్వం వహించారు. షాయాజిషిండే, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్‌రెడ్డి, సత్యంరాజేష్ ముఖ్యపాత్రల్లో కనిపించబోతున్న ఈ సినిమాకు డి.జె.వసంత్ సంగీతం అందిస్తున్నారు. ఈనెల 16నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా ఆగస్టు చివరివారంలో షూటింగ్ పూర్తిచేసుకోనుంది. రాజమండ్రి, బెంగుళూరులో చిత్ర షూటింగ్ అధిక భాగం చిత్రీకరణ జరుపుకోనుంది. ఈ చిత్రంలో శ్రీకాంత్, డింపుల్ చోపడే, నటాషాదోషి, షాయాజిషిండే, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్‌రెడ్డి, సత్యంరాజేష్, పృథ్వి, చంద్రమోహన్, సుధ, హేమ, శ్రీలక్ష్మి, జయవాణి, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: డి.జె.వసంత్, సినిమాటోగ్రఫీ: సతీష్ జి, ఎడిటర్: ఉద్ధవ్, నిర్మాత: కొలన్ వెంకటేష్, సహ నిర్మాత: సిరాజ్ వి.వెంకట్‌రావు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుధీర్‌రాజు.