20న అరుంధతి అమావాస్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కె.వంశీధర్ సమర్పణలో ప్రముఖ మోడల్ మిస్ కర్ణాటక అర్చన మోసాలి ముఖ్య పాత్రలో తోట కృష్ణ దర్శకత్వంలో శ్రీ కృష్ణ శంకర్ ప్రొడక్షన్స్ పతాకంపై కనమర్లపూడి కోటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం ‘అరుంధతి అమావాస్య’ కె.వింధ్యారాణీ సహ నిర్మాత. ఈనెల 20న దాదాపు వంద థియేటర్లకు పైగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకులు తోట కృష్ణ మాట్లాడుతూ- ‘‘అరుంధతికీ అఘోరకు మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఈ చిత్రంలో ఓ పాము ప్రధాన పాత్ర పోషిస్తుంది. అమావాస్య రోజున ముగిసే ఈ పోరాటంలో ఎన్నో మలుపులు వుంటాయి. అమ్మోరు, అరుంధతి చిత్రాల స్థాయిలో ప్రేక్షకులకు కొత్త ఫీల్ కలిగిస్తాయి. అత్యంత ఆసక్తికరంగా సాగే కథలో ప్రేక్షకులకు నచ్చే కామెడీ ఎమోషనల్ అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి’’ అన్నారు. నిర్మాత కోటేశ్వరరావు మాట్లాడుతూ- ‘సెన్సార్ పూర్తిచేసుకొని ఫస్ట్ కాపీతో ఈనెల 20న విడుదలకు సిద్ధంగా ఉంది. అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొనే విధంగా దర్శకుడు ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. అన్నిరకాల కమర్షియల్ అంశాలతో ఈ చిత్రాన్ని విడుదల చేయడం జరుగుతుంది. ఇంకా ఈ చిత్రంలో బేబీ కీర్తన, షకీలా, నిహారిక, ఆర్‌కె మామ, మధుబాబు, శంకర్‌దాదా, ఈ చిత్ర నిర్మాత కనమర్లపూడి కోటేశ్వరరావు ప్రధానపాత్ర పోషించడం జరిగింది. ఈ చిత్రానికి సంగీతం ఘనశ్యాం, మాటలు: సంతోష్ హర్షవర్ధన్, చరణ్ యలమంద, స్క్రిప్ట్: సాయినాథ్, ఫొటోగ్రఫీ: ఎం.ఎస్.గౌడ్, డిటిఎస్ మిక్సింగ్: శ్రీమిత్ర, పాటలు: బాబ్జీ, వెంకన్న, నిర్మాత కనమర్లపూడి కోటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మందాల రమేష్‌యాదవ్, కోప్రొడ్యూసర్: కె.వింధ్యారాణీ, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: తోట కృష్ణ,