జెన్నీఫర్‌గా ఆండ్రియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చరణ్‌తేజ్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో ‘నేను లోకల్’చిత్ర దర్శకుడు త్రినాథ్‌రావు నక్కిన స్టోరీ, దర్శకత్వ పర్యవేక్షణలో, ప్రముఖ దర్శకుడు మారుతి సహనిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం ఆయుష్మాన్‌భవ. సిటిఎఫ్ నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తోంది. ప్రముఖ రచయితలు పరుచూరి బ్రదర్స్ కథనంతో రూపొందుతున్న ఈ చిత్రానికి బాలీవుడ్‌లో బేబి డాళ్, హేంగ్ ఓవర్, హైహీల్స్ లాంటి సూపర్బ్‌సాంగ్స్ కంపోజ్‌చేసిన మీట్‌బ్రోస్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ హీరోయిన్ స్నేహ ఉల్లాల్ చరణ్‌తేజ్ సరసన నటిస్తోంది. అయితే ఇప్పుడీ చిత్రానికి మరో స్పెషల్ అట్రాక్షన్ తోడయ్యింది. తమిళ్‌లో అటు సింగర్‌గా.. ఇటు హీరోయిన్‌గా పలు సూపర్ హిట్స్‌తో దూసుకెళ్తున్న ఆండ్రియా... ఆయుష్మాన్‌భవ చిత్రంలో పాప్ సింగర్ జెన్నీఫర్ క్యారెక్టర్‌లో కీలక పాత్ర పోషిస్తోంది. సమాజం ప్రేమని చూసే పద్ధతి మారాలి అనే కమర్షియల్ పాయింట్‌తో తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలచేసిన దీర్ఘ ఆయుష్మాన్‌భవ టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ఆండ్రియా మొదటి లుక్‌ని విడుదల చేస్తారు. ఈ సందర్భంగా చరణ్‌తేజ్ మాట్లాడుతూ.. ముందుగా ఈ చిత్రానికి ఇంత మంచి కథని అందించటమేకాకుండా దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్న సూపర్ సక్సెస్‌ఫుల్ దర్శకుడు త్రినాథ్‌రావు నక్కినగారికి, స్క్రీన్‌ప్లే అందించిన ప్రముఖ రచయితలు పరుచూరి బ్రదర్స్‌కి నా ధన్యవాదాలు. అలాగే క్రేజీ దర్శకుడు మారుతిగారు మా చిత్రానికి సహ నిర్మాతగా బాధ్యతలు స్వీకరించారు. మా చిత్రంలో హీరోయిన్‌గా స్నేహ ఉల్లాల్ పాత్ర చాలాబాగా డిజైన్ చేశాం. అయితే ఇప్పుడీ చిత్రానికి మరో స్పెషల్ అట్రాక్షన్ తోడయ్యింది. తమిళ్‌లో అటు సింగర్‌గా.. ఇటు హీరోయిన్‌గా పలు సూపర్‌హిట్స్‌తో దూసుకెళ్తున్న ఆండ్రియా... ఆయుష్మాన్‌భవ చిత్రంలో పాప్ సింగర్ జెన్నిఫర్ క్యారెక్టర్‌లో కీలక పాత్ర పోషిస్తోంది. క్యారెక్టర్ విన్న వెంటనే చేయడానికి ఒప్పుకున్నారు. ఇక బాలీవుడ్ సూపర్ మ్యూజిక్ దర్శకుడు మీట్‌బ్రోస్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి కులం, మతం వేరైతే... మర్చిపోవాలా... పారిపోవాలా... చచ్చిపోవాలా... ప్రపంచం ఏమైతే నాకేంటి సమాజం ప్రేమని చూసే విధానంమారాలి లేకపోతే చంపేస్తా... అనుకునే హీరో క్యారక్టరైజేషన్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. తప్పకుండా అన్నివర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందని నమ్ముతున్నాం. త్వరలోనే ఆండ్రియా మొదటి లుక్‌ని విడుదల చేస్తాం అని అన్నారు. చరణ్‌తేజ్, స్నేహఉల్లాల్, ఆండ్రియా, హుజన్, పరుచూరి వెంకటేశ్వరరావు, రంగరాజన్, అశ్విన్, నిఖిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాత: మారుతి, అసోసియేట్ ప్రొడ్యూసర్: బి.ఏ.శ్రీనివాసరావు, హేమరత్న, కథ-దర్శకత్వ పర్యవేక్షణ: త్రినాథ్‌రావు నక్కిన, కథనం: పరుచూరి బ్రదర్స్, సంగీతం: మీట్‌బ్రోస్, కెమెరా: దాశరథి శివేంద్ర, ఆర్ట్: పి.ఎస్.వర్మ, కాస్ట్యూమ్స్: హారిక, దర్శకత్వం: చరణ్ తేజ్.