ప్రేమలో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాల భామ త్రిష.. ప్రస్తుతం ప్రేమలో పడిందన్న విషయం సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో హల్‌చల్ అవుతుంది. ప్రస్తుతం ఓ వ్యక్తితో డీప్ లవ్‌లో ఉందట. త్వరలోనే పెళ్లి కూడా చేసుకునే ఆలోచనలో ఉన్నదని వార్తలు వస్తున్నాయి. దాదాపు దశాబ్దకాలంగా సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగువెలిగిన ఈ అమ్మడికి ఈమధ్య క్రేజ్ తగ్గింది. దాంతో పెళ్ళికి సిద్ధమైంది.. కానీ నిశ్చితార్థం తరువాత కొన్ని కారణాలవల్ల పెళ్లి రద్దుఅవడంతో మళ్ళీ సినిమాలపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో మాత్రమే నటిస్తుంది. ఇప్పటికే నాలుగు సినిమాల్లో నటిస్తున్న త్రిష.. అన్ని సినిమాల్లో ఆమె కీరోల్ పోషిస్తుండడం విశేషం. ఇప్పటికే ఎన్నో ఆశలు పెట్టుకున్న నాయకి ప్లాప్ అవ్వడంతో ఈ అమ్మడికి తీవ్ర నిరాశ మిగిలింది. తాజాగా నటించిన మోహిని విడుదలకు సిద్దంగా వుంది. దాంతోపాటు గర్జనై, 96. సాతురంగ వెట్టై-2, 1818 లాంటి సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. త్వరలోనే మోహిని విడుదలకు సిద్ధం అవుతుంది. తాజాగా త్రిష విదేశాల్లో వెకేషన్‌కోసం వెళ్లిందట.. అయితే ఆమె ఒంటరిగా కాదు.. తన ప్రియుడితోనే వెళ్లిందంటూ ప్రచారం మాత్రం జోరుగా జరుగుతుంది. మరి త్రిషని లవ్‌లోకి దించిన ఆ ప్రేమికుడు ఎవరన్నది తెలియాల్సి ఉంది.