ఓ ప్రయాణంలా సాగింది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ జంటగా అజయ్ భూపతి దర్శకత్వంలో కెసిడబ్ల్యూ బ్యూనర్‌పై అశోక్‌రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తున్న చిత్రం ‘ఆర్‌ఎక్స్ 100’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం నేడు (గురువారం) విడుదలవుతున్న సందర్భంగా హీరో కార్తికేయ చెప్పిన విశేషాలు...
ఆర్‌ఎక్స్ 100 సినిమా షూటింగ్ ఆ బండిమీద ప్రయాణం లాగే సాగింది. చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం. విడుదలకోసం ఆసక్తిగా వున్నాం. ఇది ప్రేమకథే అయినా రెగ్యులర్ ఫార్మెట్‌లో ఎక్కడో కాఫీ షాపులో మొదలౌతుందని చెప్పే కథ కాదు. రియల్ సంఘటనల నేపథ్యంలో సాగుతుంది. ఒక మండల కేంద్రంలో జరిగే కథ ఇది. ప్రస్తుతం తెలుగులో ప్రయోగాత్మక చిత్రాలు వస్తున్నాయి. ప్రేక్షకులు కూడా భిన్నమైన సినిమాలను ఆదరిస్తున్నారు. ముఖ్యంగా ప్రయోగాత్మక సినిమాలో ఏదైనా జరగొచ్చు. ప్రేమ నేపథ్యంలో సాగే ఈ కథ ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని అంశాలతో వుంటుంది. అలాగని అర్జున్‌రెడ్డి సినిమాతో పోల్చలేము. ఇందులో హీరో ఒక సందర్భంలో అమాయకంగా కనిపిస్తాడు. కథ మొత్తం నడిపించేది హీరోయినే్న. హీరోయిన్ పాత్ర డామినేట్ చేస్తూ యారోగంట్‌గా వుంటుంది. అలాంటి కానె్సప్టులోనుంచి హీరో ఎలా ట్రిమ్ సైకోనెస్‌లోకి వెళ్ళాడనేదే కథ. ఇంత వేరియేషనున్న సినిమా నా జీవితంలో చూడలేదు. ఇందులో నా పాత్రకు ఓ ప్రత్యేకమైన కేరెక్టర్ అంటూ వుండదు. ఊర్లో వుండే డీసెంట్ కుర్రాడే కానీ పరిస్థితులకు తగ్గట్టుగా మారుతూంటారు. వాడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అన్న విషయాన్ని దర్శకుడు అజయ్ అద్భుతంగా చూపించాడు. రియల్ సంఘటనల నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. ఇక నా గురించి చెప్పాలంటే నాది హైదరాబాదే. వనస్థలిపురంలో ఉంటాము. నాన్నకు స్కూల్ వుంది. నేను వరంగల్ నిట్‌లో ఇంజనీరింగ్ చేశాను. చిన్నప్పటినుంచీ సినిమాలంటే ఆసక్తి. దానికోసం డాన్సులు నేర్చుకున్నాను. ఇదివరకే హీరోగా ఓ చిత్రం చేశాను. కానీ అది అంతగా ఆకట్టుకోలేదు. ఈ సినిమా కోసం దర్శకుడు నన్ను కలిసి కథ చెప్పడంతో బాగా మెచ్చి ప్రొసీడ్ అయ్యాం. ఈ కథకు ఇమేజ్ వున్న హీరో సరిపోడు. కొత్తవారైతేనే కుదురుతుంది. తప్పకుండా నాకు మంచి సక్సెస్ వస్తుందన్న నమ్మకం వుంది అన్నారు.