ఆ టెన్షన్ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజేత.. అప్పట్లో చిరంజీవి హీరోగా వచ్చిన ఈ చిత్రం సంచలన విజయం సాధించి చిరంజీవిని విజేతను చేసింది. ఇప్పుడు అదే టైటిల్‌తో ఆయన చిన్నల్లుడు కళ్యాణ్‌దేవ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. రాకేష్ దర్శకత్వంలో వారాహి చలనచిత్ర బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రం గురువారం విడుదలవుతున్న సందర్భంగా కళ్యాణ్‌దేవ్ చెప్పిన విశేషాలు...
చిన్నప్పటినుంచీ సినిమాలంటే చాలా ఆసక్తి వుండేది. అందుకే స్కూల్‌లో డ్రామాలు, డాన్సు ప్రోగ్రాముల్లో పాల్గొనేవాడిని. ఇంజనీరింగ్ తరువాత బిజినెస్ చూసుకుంటూ బాలీవుడ్‌లో ఓ అవకాశం వచ్చింది. కానీ అది వర్కవుట్ కాలేదు. ఆ తరువాత సత్యానంద్ వద్ద నటనలో శిక్షణ తీసుకున్నాను. ఆ సమయంలో ఈ అవకాశం వచ్చింది. దర్శకుడు రాకేష్ కొత్త హీరో కోసం చూస్తున్నాడని తెలిసి సత్యానంద్‌గారు నా ఫొటోలు పంపించారు. వారి కథకు నేను సరిపోతానని నన్ను కలిశారు. ఈ కథను మామయ్య చిరంజీవి విని బాగుందన్నారు. దాంతో సెట్స్‌పైకెళ్లింది. ఇదొక మిడిల్ క్లాస్ యువకుడి కథ. తండ్రీ కొడుకుల కథని చెప్పాలి. తప్పకుండా నేటి యూత్‌కు కనెక్టవుతుంది. ఇక విజేత అనే టైటిల్ పెట్టడానికి కారణం కథ ప్రకారమే అనుకున్నది తప్ప చిరంజీవి ఇమేజ్ వాడుకోవాలని కాదు. ఈ సినిమా సమయంలో మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్నాను కాబట్టి కాస్త టెన్షన్‌గానే వుంది. కానీ ఆ ఫోర్సు మాత్రం లేదు. దర్శకుడు రాకేష్ అద్భుతంగా తెరకెక్కించాడు. ఇక వారాహి లాంటి బ్యానర్‌లో నా మొదటి సినిమా చేయడం ఆనందంగా వుంది. తప్పకుండా సినిమాపై నమ్మకముంది. హీరోయిన్‌గా నటించిన మాళవికా నాయర్ అద్భుతంగా నటించింది. తను నాకంటే సీనియర్ అయినా మంచి సపోర్టు అందించింది. ఈ సినిమాను మావయ్య రఫ్‌వర్క్‌లో చూశారు. బాగుందని అభినందించారు. తప్పకుండా అందరికీ నచ్చే సినిమా అవుతుంది. నాకు బిజినెస్‌మెన్‌గా కంటే కూడా హీరోగా వుండడమే బాగుంది.