బర్త్‌డే గిఫ్ట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్ స్టార్ మహేష్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇప్పటికే మొదటి షెడ్యూల్‌ని డెహ్రాడూన్‌లో షూటింగ్ జరుపుకుంది. తదుపరి షెడ్యూల్‌కోసం ఫారిన్ బయలుదేరి వెళుతున్నారు. మహేష్‌తో సినిమాకోసం చాలారోజులు ఎదురుచూసిన వంశీ మహేష్ 25వ సినిమా కావడంతో అత్యంత క్రేజీగా తెరకెక్కించే సన్నాహాలు చేస్తున్నాడు వంశీ. ఇక ఈ సినిమాకు ఏ టైటిల్ పెడతారా అన్న ఆసక్తి ఎక్కువైంది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌పై ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. టైటిల్‌ని ఇంకా ఖరారుచేయలేదని తెలుస్తోంది. దాంతోపాటు ఫస్ట్‌లుక్ కూడా త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నారట. ఏంటి ఫస్ట్‌లుక్ వచ్చేస్తుందా అని అనుకుంటున్నారా.. అవును ఆగస్టు 9న మహేష్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్‌తో కూడిన ఫస్ట్‌లుక్‌ని విడుదల చేస్తారట. పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కీరోల్ పోషిస్తున్నాడు. దిల్‌రాజు, అశ్వినీదత్, పివిపిలు నిర్మిస్తున్నారు. సో మహేష్ ఫాన్స్.. ఈ పుట్టినరోజుకు మహేష్‌నుండి మంచి గిఫ్ట్ వస్తుందన్నమాట.