బంపర్ ఆఫర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓరు ఆధార్ లవ్ చిత్రంలో నటించిన మలయాళ భామ ప్రియా ప్రకాష్ వారియర్ పేరు చెబితే దాదాపుగా తెలియనివారుండరు. ఎందుకంటే ఆ చిత్రం షూటింగ్‌లో వున్న సమయంలో అప్పట్లో విడుదలైన ఒక పాటలో తన కనుసైగలతో యావత్ యువత మొత్తాన్ని కూడా తనవైపునకు తిప్పుకున్న అమ్మాయి ప్రియా ప్రకాష్ వారియర్. తన కనుసైగల వీడియో అప్పట్లో సోషల్ మీడియా మాథ్యమాల్లో పెను సంచలనమే సృష్టించింది. ఈ చిత్రం విడుదలై మంచి విజయవంతం కావడంతో అమితమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించింది ఈ అమ్మడు. అక్కడినుండి ఆమెకు సినిమా ఆఫర్లు కూడా వెల్లువలా వచ్చిపడుతున్నాయట. ఇప్పటికే ఈ భామ ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు ఆరు లక్షలకుపైగా ఫాలోవర్స్ వున్నారు. అందులో ఈమె చేసే ప్రతిపోస్ట్‌కు రూ. 8 లక్షల రూపాయల వరకు ఆమెకు ముడుతుందట. అంతటి పేరు, క్రేజ్ సంపాదించిన ప్రియా, ఇప్పుడు ఏకంగా ఒక బంపర్ ఆఫర్ కొట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల ఒక ప్రముఖ వాణిజ్య ప్రకటనల సంస్థ ప్రియతో ఏకంగా రూ. కోటికి సంబంధించిన తమ కంపెనీ యాడ్ ఫిలిం కోసం ఆమెకు రెమ్యూనరేషన్‌గా ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. కాగా ఆ వాణిజ్య ప్రకటనలకు సంబంధించిన కొన్ని ఫొటోలు ఇపుడు ఇంటర్నెట్‌లో దర్శనమిస్తున్నాయి.