నన్ను దోచుకుందువటే టీజర్ వస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమ్మోహనంతో తెలుగు ప్రేక్షకుల్ని సమ్మోహనం చేసుకున్న హీరో సుధీర్‌బాబు. సుధీర్‌బాబు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో దర్శకుడు ఆర్.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం నన్ను దోచుకుందువటే. ఈ చిత్రం మొదటి లుక్ పోస్టర్ నుండి ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. నభా నటేశ్ ఈ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఈనెల 14న టీజర్‌ని విడుదల చేస్తున్నాం. చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు ఆర్.ఎస్.నాయుడు మాట్లాడుతూ- సుధీర్‌బాబు హీరోగా సుధీర్‌బాబు ప్రొడక్షన్స్‌లో నన్ను దోచుకుందువటే టీజర్‌ను ఈనెల 14న విడుదల చేస్తున్నాము. ఈ చిత్రం ప్రొడక్షన్ విలువలు ఎక్కడా తగ్గకూడదు అనే సంకల్పంతో సుధీర్‌బాబు చేస్తున్నారు. కథ చాలా ఫ్రెష్‌గా వుంది. కొత్త హీరోయిన్ అయినప్పటికీ నభా నటేశ్ బాగా చేసింది. అజనీష్ సంగీతం స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. మిగతా వివరాలు త్వరలో ప్రకటిస్తాం అన్నారు. ఈ చిత్రంలో సుధీర్‌బాబు, నభా నటేశ్, నాజర్, తులసి, వేణు, రవివర్మ, జీవా, సౌందర్‌రాజన్, సుదర్శన్ నటిస్తున్నారు.