బిగ్‌బాస్‌లోకి కుమారి 21?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం మాటీవీలో ప్రసారం అవుతున్న బిగ్‌బాస్ రియాలిటీ షో రెండో సీజన్ రసవత్తరంగా సాగుతున్న విషయం తెలిసిందే. నాని హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోలో ఇప్పటికే ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. అయితే ఈమధ్య షో క్రేజ్ బాగా తగ్గుతుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ షోపై మరింత క్రేజ్ పెంచేలా నిర్వాహకులు క్రేజీ స్టార్స్‌ని రంగంలోకి దింపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కుమారి 21 ఎఫ్ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న హెబ్బాపటేల్ ఈ షోలో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇస్తుందట. వైల్డ్‌కార్డు ఎంట్రీ ద్వారా ఈమె షోలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే ఆమెతో చర్చలు జరిపారని ఈ షోలో పాల్గొనేందుకు హెబ్బా కూడా ఓకె చెప్పిందట. ఇక హెబ్బా పటేల్‌కు ఈమధ్య వరుస పరాజయాలతో అవకాశాలు తగ్గాయి. దాదాపు ఏడాదికాలంగా ఈ అమ్మడికి చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. అటు కోలీవుడ్‌లో కూడా అదే పరిస్థితి ఉండడంతో హెబ్బా.. కొంత గ్యాప్ తీసుకుని మళ్లీ ఎంట్రీ ఇచ్చి.. తాజాగా 24 కిస్సెస్ అనే సినిమాలో నటిస్తోంది. మరి హెబ్బా ఎంట్రీతో బిగ్‌బాస్ షో క్రేజ్ పెరుగుతుందేమో చూడాలి.