‘ఆర్‌ఎక్స్ 100’ విజయోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ హీరో హీరోయిన్లుగా కెసిడబ్ల్యు బ్యానర్‌పై అశోక్‌రెడ్డి గుమ్మకొండ నిర్మించిన చిత్రం ఆర్‌ఎక్స్ 100. ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. యాన్ ఇన్‌క్రెడిబుల్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా గురువారం విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో జరిపారు. నిర్మాత మాట్లాడుతూ.. ‘‘ఏడాది క్రితం స్క్రిప్ట్‌తో సినిమా మొదలుపెట్టాం. ఇపుడు విడుదలై పెద్ద విజయం సాధించినందుకు ఆనందంగా వుంది. ఉదయం వర్షం కురిసేసరికి ప్రజలు థియేటర్‌కు వస్తారో, రారో అనే భయం కలిగింది. అయినా వచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 175, ప్రపంచ వ్యాప్తంగా 300 థియేటర్లలో విడుదల చేశాం. తొలిరోజే మాకు రూ. 2 కోట్ల గ్రాస్ వచ్చేసింది. డైరెక్టర్‌ని నమ్మి సినిమా చేశాం. పెద్ద హిట్ అయినందుకు ఆనందంగా వుంది అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ.. నేను ఎనిమిది, తొమ్మిదేళ్ల క్రితం పరిశ్రమకు వచ్చాను. మా ఊరి నుంచి కూడా ఎవరూ పరిశ్రమకు రాలేదు. నాతోపాటు, మా అమ్మా నాన్నలు కూడా ఎన్నో అవమానాలు పడ్డారు. కోట్లు కుమ్మరించినా కొనుక్కురాలేని చాలా విషయాలను నేను మిస్ చేసుకున్నాను. అయినా ఇవాళ ఈ సినిమా విజయం వాటన్నింటినీ మరపిస్తోంది. థియేటర్లో చాలా మంచి స్పందన వస్తోంది. ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా సినిమా చూడాలి. సగం యువతకోసం, సగం ఫ్యామిలీ ఆడియెన్స్ కోసం సినిమా చేశాను. ఫ్యామిలీ ఆడియెన్స్ చూసినపుడే సినిమా నిజమైన విజయం సాధించిందని నమ్ముతాను అన్నారు. హీరోయిన్ పాయల్ మాట్లాడుతూ- చాలా బోల్డ్‌గా ధైర్యం చేసి చేశాను. అందరూ మెచ్చుకుంటుంటే ఆనందంగా ఉంది అన్నారు. హీరో కార్తికేయ మాట్లాడుతూ విజయాన్ని ముందే ఊహించాం. సినిమా పెద్ద హిట్ అయినందుకు ఆనందంగా ఉంది అన్నారు.